రాజశేఖర్ మరో జగపతిబాబు అవ్వగలడా?

ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లాడు యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్. ఇప్పుడు ఆయనకు ఉన్న మార్కెట్ పడిపోయింది. అయినప్పటికీ హీరో పాత్రలే చేయాలని గిరిగీసుకోవడంతో అవకాశాలు రావడం లేదు. అలాంటి సమయంలో నితిన్ హీరోగా..

ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లాడు యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్. ఇప్పుడు ఆయనకు ఉన్న మార్కెట్ పడిపోయింది. అయినప్పటికీ హీరో పాత్రలే చేయాలని గిరిగీసుకోవడంతో అవకాశాలు రావడం లేదు. అలాంటి సమయంలో నితిన్ హీరోగా..

యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్‌ సినీ కెరీర్‌ ను ఆరంభించి దాదాపుగా నాలుగు దశాబ్దాలు అవుతోంది. 1984లో తమిళ్ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డాక్టర్ రాజశేఖర్‌ తెలుగు ప్రేక్షకులకు ఆ మరుసటి ఏడాదిలోనే విజయశాంతి కీలక పాత్రలో నటించిన ప్రతిఘటన సినిమాతో పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా నిలిచాడు. ఒకానొక సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు పోటీగా రాజశేఖర్‌ నిలిచి తన సత్తా చాటాడు. అయితే గత కొంత కాలంగా ఆయన టైమ్ నడవడం లేదు. ఆయన వయసు మీద పడ్డా కూడా ఆ విషయాన్ని గుర్తించకుండా ఇతర సీనియర్‌ హీరోల మాదిరిగా నేను కూడా హీరోగానే చేస్తాను అన్నట్లుగా పట్టుబట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

హీరోగా ఫ్లాప్స్ పడుతున్నా కూడా దశాబ్ద కాలంగా ఆయన హీరోయిజం చూపిస్తూనే ఉన్నాడు. ఆ మధ్య క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తాడట అనే ప్రచారం జరిగింది.. కానీ చేయలేదు. ఎట్టకేలకు నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి ఈ వారంలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ట్రైలర్ లో రాజశేఖర్‌ పాత్ర గురించి క్లారిటీ ఇవ్వలేదు. విలన్‌ గా కనిపించబోతున్నాడా.. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈ సినిమాలో కనిపిస్తాడా అనేది స్పష్టత ఇవ్వక పోవడంతో రాజశేఖర్‌ పాత్ర పై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది.

వరుస ఫ్లాప్స్ పడ్డా కూడా యాంగ్రీ యంగ్‌మన్ ఫ్యాన్స్‌ ఆయన నుంచి వరుస సినిమాలు ఆశిస్తూనే ఉన్నారు. హీరోగా కాకున్నా కూడా జగపతి బాబు తరహాలో వరుసగా విలన్‌ పాత్రలు, ముఖ్య పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్‌ గా ఎన్నో సినిమాలు చేసి ఒకానొక సమయంలో స్టార్‌ హీరోలతో పోటీ పడ్డ జగపతిబాబు కూడా వరుసగా ఫ్లాప్స్ పడుతూ ఉండటంతో లెజెండ్‌ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ కి పూర్తి విరుద్దమైన విలన్‌ పాత్ర చేసి అందరిని సర్ ప్రైజ్ చేశాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు, జగపతిబాబు పాన్ ఇండియా విలన్‌ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలిచిన విషయం తెల్సిందే.

ఇప్పుడు రాజశేఖర్‌ కూడా జగపతిబాబు తరహాలో వరుసగా విలన్ రోల్స్ చేయడంతో పాటు, మంచి పాత్రలు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. అయితే జగపతిబాబుకు బాలయ్య రూపంలో అద్భుతమైన లెజెండ్‌ దక్కింది. కానీ అందరికీ అలాంటి అదృష్టం వెంటనే దక్కుతుందని చెప్పలేం. కనుక రాజశేఖర్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాతోనే ఆ స్థాయికి వెళ్తాడా అంటే కష్టమే.. అయితే ముందు ముందు మంచి పాత్రలను, కథలను, దర్శకులను ఎంపిక చేసుకుని పాత్రలు చేస్తే తప్పకుండా ఇండస్ట్రీలో రాజశేఖర్‌ మరో జగ్గూ భాయ్ గా నిలవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Show comments