iDreamPost
android-app
ios-app

తిమింగలం నోట చిక్కిన చేపలా బుచ్చిబాబు పరిస్థితి!

  • Published Feb 08, 2024 | 7:52 PM Updated Updated Feb 08, 2024 | 7:52 PM

Shankar- Buchi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బుచ్చిబాబు పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు ఉంది. మరి.. ఆ పరిస్థితి కారణం ఏంటో చూడండి.

Shankar- Buchi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బుచ్చిబాబు పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు ఉంది. మరి.. ఆ పరిస్థితి కారణం ఏంటో చూడండి.

  • Published Feb 08, 2024 | 7:52 PMUpdated Feb 08, 2024 | 7:52 PM
తిమింగలం నోట చిక్కిన చేపలా బుచ్చిబాబు పరిస్థితి!

చిన్న చేపని.. పెద్ద చేప మింగడం అనేది లోకనీతి. సినీ ఇండస్ట్రీ కూడా ఇందుకు అతీతం కాదు. ప్రస్తుతం బుచ్చిబాబు కూడా ఓ భారీ తిమింగళానికి ఇలానే చిక్కిపోయాడు. బుచ్చిబాబుని నోట పట్టేసుకున్న ఆ తిమింగలమే దర్శకుడు శంకర్. ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సీనియర్ దర్శకుడు శంకర్ కి.. బుచ్చిబాబుకి ఓ చిన్న లింక్ ఉంది. ఆ లింక్ పేరే రామ్ చరణ్. RRR అయిపోగానే ఆగ మేఘాల మీద గేమ్ ఛేంజర్ సెట్ లో వాలిపోయాడు రామ్ చరణ్. శంకర్ డైరెక్షన్.. వందల కోట్ల బడ్జెట్.. కొడితే కుంభస్థలమే అన్నట్టు కొన్ని నెలలు హీట్ నడిచింది. ఈ క్రేజ్ లో రామ్ చరణ్ తో సినిమా తీయాలని మేకర్స్ ఆశ పడ్డారు. చాలా మంది పోటీపడ్డా బుచ్చిబాబుని అదృష్టం వరించింది. రామ్ చరణ్ ని శంకర్ వదిలేయగానే.. తన స్పోర్ట్స్ డ్రామాలో సెట్ చేసేయాలని బుచ్చి.. పెద్ద కలలే కన్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు లెక్క మారిపోయింది.

బుచ్చిబాబు- రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యి.. అర్ధ సంవత్సరం దాటిపోయింది. ఫస్ట్ హిట్ కొట్టి కసి మీద ఉన్న బుచ్చిబాబు చరణ్ రాక కోసం ఇంకా ఎదురుచూస్తేనే ఉన్నాడు. శంకర్ మాత్రం ఏదీ ఒక పట్టాన తెంచడం లేదు. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఎన్నిసార్లు వాయిదా పడిందో లెక్కేలేదు. నత్త నడకన సాగుతున్న షూటింగ్. కనీసం సాంగ్స్ హామ్ చేసుకుందామన్నా ఫ్యాన్స్ కి ఆ అదృష్టం కూడా లేదు. ఇంత డిలేలో ఇండియన్-2 వచ్చి శంకర్ పీకలపైన కూర్చుంది. ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్ట్.. పూర్తి చేసి తీరాలి. అవతల వైపు కమల్ హాసన్. షెడ్యూల్ మిస్ అయితే మళ్ళీ డేట్స్ దొరకవు. శంకర్ పూర్తిగా మునిగిపోయాడు. రామ్ చరణ్ కి నచ్చచెప్పుకుని రెండు పడవల ప్రయాణం చేసుకుంటున్నాడు.

గేమ్ ఛేంజర్ తో పాటు ఇండియన్-2 కూడా ప్యారలల్ గా సాగిపోతుంది కాబట్టి శంకర్ హ్యాపీ. గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ బాగా వస్తుంది కాబట్టి చరణ్ హ్యాపీ. మరి.. ఇక్కడ చాలా కాలంగా లూప్ లైన్ లో ఆగి ఉన్న బుచ్చిబాబు పరిస్థితి ఏంటి? ఇప్పటికే కథని అన్నీ విధాలా పర్ఫెక్ట్ గా సెట్ చేసి పెట్టుకున్నాడు. స్టార్ కాస్ట్ సిద్ధం. ప్యాడింగ్ డేట్స్ లాక్ అయ్యాయి. కానీ.., చెర్రీ రావడానికి ఇంకా లేట్ అయ్యేలా ఉంది. అసలు ఎంత టైమ్ పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అంతా శంకర్ సర్ మహిమ. బుచ్చిబాబు బాధ తీర్చాలిసింది ఆయనే. ఇప్పటికే నెలలు గడిచిపోయాయి. ఇకనైనా బుచ్చిని.. బడా డైరెక్టర్ కరుణిస్తాడా? చరణ్ ని తన గేమ్ నుండి రిలీజ్ చేస్తాడా? చూడాలి ఏమి అవుతుందో!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio