iDreamPost
android-app
ios-app

ఐదేళ్ల బంధం ముగిసింది! ఫ్యాన్స్ కి షాకిచ్చిన వైరల్ లవ్ బర్డ్స్..

  • Published May 31, 2024 | 7:06 PM Updated Updated May 31, 2024 | 7:06 PM

Breakup Rumors On Viral Love Birds: సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్, ప్యాచప్ పదాలు చాలా బాగా వినిపిస్తూ ఉంటాయి. తాజా మరో వైరల్ లవ్ బర్డ్స్ విడిపోయినట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. వాటిని ఒక వ్యక్తి కన్ఫామ్ కూడా చేస్తున్నాడు.

Breakup Rumors On Viral Love Birds: సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్, ప్యాచప్ పదాలు చాలా బాగా వినిపిస్తూ ఉంటాయి. తాజా మరో వైరల్ లవ్ బర్డ్స్ విడిపోయినట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి. వాటిని ఒక వ్యక్తి కన్ఫామ్ కూడా చేస్తున్నాడు.

  • Published May 31, 2024 | 7:06 PMUpdated May 31, 2024 | 7:06 PM
ఐదేళ్ల బంధం ముగిసింది! ఫ్యాన్స్ కి షాకిచ్చిన వైరల్ లవ్ బర్డ్స్..

ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో ఈ మాటలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎంత త్వరగా దగ్గరవుతారో.. అంతే త్వరగా దూరం కూడా అవుతూ ఉంటారు. అలాగని అందరూ సెలబ్రిటీలను తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నేళ్లుగా ఆదర్శ కపుల్ గా ఉన్న స్టార్స్ కూడా ఉన్నారు. అలాగే పెళ్లైన ఏడాదికే విడిపోయిన కపుల్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఒక స్టార్ కపుల్ చేరింది. ఏకంగా ఐదేళ్ల పాటు ప్రేమించుకుని.. ఇప్పుడు విడిపోతున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన బ్రేకప్ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు చెప్పుకుంటున్న స్టార్ కపుల్ మరెవరో కాదు.. బాలీవుడ్ వైరల్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్. మలైనా అరోరా- అర్జున్ కపూర్ ప్రేమ బంధం గురించి బాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవల్లో అందరికీ తెలిసిందే. అర్జున్ కపూర్ తనకన్నా 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమాయణం కొనసాగించాడు. వీళ్ల ప్రేమ బాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే. అయితే వీళ్లు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని.. విడిపోయారు అంటూ చాలానే వార్తలు వచ్చాయి. అయితే వాటిపై వీళ్లు ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా వారికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి వారు విడిపోయినట్లు ధృవీకరించాడు. ఈ విషయంపై జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఆ ప్రముఖ వ్యక్తినే కోట్ చేస్తూ విడాకుల వార్తలను ప్రచురిస్తున్నారు.

మలైకా అరోరా- అర్జున్ కపూర్ల మధ్య బంధం ఎంతో గొప్పది అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అలాగే వారు విడిపోయిన తర్వాత కూడా వారి బంధాన్ని కొనసాగిస్తారని చెప్పుకొచ్చాడు. వారికి ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం ఉంది అంటూ తెలిపారు. అసలు వారి బ్రేకప్ విషయాన్ని ప్రచారం చేయడం, చర్చించడం కూడా వారికి ఇష్టం లేదు అంటూ ఆ వ్యక్తి వ్యాఖ్యానిచాడు. వీరి ప్రేమాయణానికి సంబంధించి గతంలో కూడా చాలానే వార్తలు వచ్చాయి. గతేడాది ఇలాగే బ్రేకప్ వార్తలు వస్తే.. మలైకా వాటిని కొట్టిపారేసింది.

ఐదేళ్ల క్రితం వీరి ప్రేమబంధాన్ని ప్రకటించారు. అప్పట్లే పబ్బులు, పార్టీలు, మాల్స్ ఎక్కడ చూసినా వీళ్లిద్దరే కనిపించేవాళ్లు. గతంలో వీరి వయసుకు సంబంధించి కూడా ఎక్కువ విమర్శలు వచ్చేవి. తనకంటే 12 ఏళ్ల చిన్న వాడిని ప్రేమించడంపై అంతా విమర్శించారు. ఆ విమర్శలను సైతం మలైకా కొట్టిపారేసేది. అసలు ప్రేమకు, వయసుకు ఏంటి సంబంధం అంటూ కామెంట్స్ చేసింది. ఈసారి మాత్రం వస్తున్న బ్రేకప్ వార్తలపై మలైకా అరోరా స్పందించడం లేదు. అలాగే వాటిని ఖండించడం లేదు. అందుకే ఈసారి బ్రేకప్ వార్తలు కచ్చితంగా నిజం అయి ఉంటాయి అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgray girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom