P Krishna
Rock Singer Ayres Sasaki: తన గానంతో కోట్ల మంది సంగీత ప్రియులను అలరించాడు.. ఆయన సంగీత కచెరీకి కోట్ల మంది అభిమానులు వస్తుంటారు. ఈ క్రమంలోనే లైవ్ షోలో దారుణ సంఘటన జరిగింది.
Rock Singer Ayres Sasaki: తన గానంతో కోట్ల మంది సంగీత ప్రియులను అలరించాడు.. ఆయన సంగీత కచెరీకి కోట్ల మంది అభిమానులు వస్తుంటారు. ఈ క్రమంలోనే లైవ్ షోలో దారుణ సంఘటన జరిగింది.
P Krishna
ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందినవారు, ఇతర కళారంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్ ఇతర కారణాల వల్ల కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తన గానంతో కోట్ల మంది అభిమానులను ఉర్రూతలూగించాడు. ఆయన లైవ్ షో ఉందంటే చాలు అభిమానులు ఎంతో ఉత్సాహంతో తరలి వస్తుంటారు. టీవీలు, సోషల్ మాధ్యమాల్లో లక్షల సంఖ్యల్లో వీక్షిస్తుంటారు. అలాంటి ఆ స్టార్ సింగర్ లైవ్ షో నిర్వహిస్తుండగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఎవరు ఆ స్టార్ సింగర్, ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళితే..
బ్రెజిల్ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెజిలియన్ రాక్ సింగర్ ఐరెస్ సనాకి (35) లైవ్ షో చేస్తుండగా హఠాత్తుగా విద్యుత్ షాక్ కి గురై ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైవ్ షోలో తమ అభిమాన గాయకుడు కన్నుమూయడంతో అభిమానులు నిర్ఘాంతపోయారు. బ్రెజిల్ లోని సాలియోనో పోలిస్‌లోని సోలార్ హూటల్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హూటల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయం గురించి ఒక ప్రకటన చేశారు. ఆయన కుటుంబానికి ఎల్లపుడు మద్దతు ఇస్తామని అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇందుకు అంకితభావంతో ఉన్నామని తెలిపింది. పోస్ట్‌లో అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
బ్రెజిల్ మీడియా కథనం ప్రకారం.. ఐరెస్ సనాకి లైవ్ షో ఇస్తున్నప్పుడు ఓ అభిమాని అతని వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఐరెస్ సనాకి చేసిన చిన్న పొరపాటు అతని ప్రాణాలు తీసిందని అంటున్నారు. అతని వద్దకు వచ్చిన అభిమాని నీటిలో తడిసి ఉన్నాడని.. అతన్ని కౌగిలించుకునే సమయంలో కేబుల్ నుంచి కరెంట్ ప్రవహించి ఐరెస్ సనాకి తాకడంతో ఆయన షాక్ కి గురై వెంటనే చనిపోయినట్లు చెబుతున్నారు. ఐరెస్ సనాకి గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొకి దర్యాప్తు చేస్తున్నారు. లైవ్ షో వద్దకు అభిమాని ఎందుకు తడిసి వెళ్లాడు? అన్న విషయంపై సాలియోనో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.