iDreamPost
android-app
ios-app

గుట్టుగా పెళ్లి చేసుకున్న బ్రమ్మిగాడి కథ మూవీ హీరోయిన్

  • Published Feb 05, 2024 | 9:39 PM Updated Updated Feb 05, 2024 | 9:39 PM

మరో హీరోయిన్ పెళ్లిపీటలెక్కింది. తను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడింది. అయితే ఈ వివాహవేడుక అత్యంత సన్నిహితుల మధ్య గుట్టుగా జరిగగా.. పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

మరో హీరోయిన్ పెళ్లిపీటలెక్కింది. తను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడింది. అయితే ఈ వివాహవేడుక అత్యంత సన్నిహితుల మధ్య గుట్టుగా జరిగగా.. పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published Feb 05, 2024 | 9:39 PMUpdated Feb 05, 2024 | 9:39 PM
గుట్టుగా పెళ్లి చేసుకున్న బ్రమ్మిగాడి కథ మూవీ హీరోయిన్

ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు తమ బ్యాచిలర్ లైఫ్ కు టాటా చెప్పేస్తున్నారు. ప్రేమించిన వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్స్ చాలామందే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లిపీటలెక్కింది. తను ప్రేమించిన వ్యక్తితో రహస్యంగా పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి అస్మితా సూద్.

హీరోయిన్ అస్మితా సూద్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. ఈ వివాహ వేడుక గోవాలో గుట్టుగా జరిగింది. కొంతకాలంగా గుజరాతీ వ్యాపారవేత్త సిద్ధ్ మెహతాతో ప్రేమాయణం సాగిస్తున్న ఈ అమ్మడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లోనే నిశ్చితార్థం కాగా.. అస్మితా సూద్ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో ఫిబ్రవరి తొలి వారంలో ‘లవ్ ఆఫ్ లైఫ్’ సిద్ధ్ మెహతాను వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింటా చక్కెర్లు కొడుతున్నాయి. 2011లో బ్రమ్మిగాడి కథ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో పలు టెలివిజన్ షోలల్లో కూడా నటించి పాపులారిటీ పొందింది.

Actress asmita sood got married

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss