iDreamPost
android-app
ios-app

Brahmanandam: డైరెక్ట్ గా ఓటీటీలోకి బ్రహ్మానందం మూవీ.. ఎక్కడంటే !

  • Published Feb 01, 2024 | 8:03 PM Updated Updated Feb 01, 2024 | 8:03 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ కింగ్ అంటే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి "బ్రహ్మానందం". ఈరోజున బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న చిత్రాల టైటిల్స్, విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్.

తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ కింగ్ అంటే మొదటిగా గుర్తొచ్చే వ్యక్తి "బ్రహ్మానందం". ఈరోజున బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న చిత్రాల టైటిల్స్, విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్.

  • Published Feb 01, 2024 | 8:03 PMUpdated Feb 01, 2024 | 8:03 PM
Brahmanandam: డైరెక్ట్ గా ఓటీటీలోకి బ్రహ్మానందం మూవీ.. ఎక్కడంటే !

ఒక చిత్రంలో హీరో , హీరోయిన్ , విలన్ ఇలా ఎంతమంది ఎంత బాగా నటించిన సరే.. ఆ చిత్రంలో కామెడీ లేకపోతే మాత్రం.. ఆ చిత్రానికి అర్ధం లేకుండా పోతుంది. ఇక ప్రత్యేకించి తెలుగు చిత్రాల్లో కామెడీ అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి.. “బ్రహ్మానందం”. ఒకప్పటి తరం వారి నుంచి నేటి తరం వారి వరకు ఈ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం. ఇలా యావత్ సినీ అభిమానులను మనసారా నవ్వుకునేలా చేసే.. మంత్ర యోగి .. ఈ హాస్య బ్రహ్మానందం. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మందిని నవ్వించారు బ్రహ్మి. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన బ్రహ్మానందం త్వరలో ఓటీటీలోకి కూడా తన ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈరోజున బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న సినిమాలా వివరాలను ప్రకటించారు మేకర్స్.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది ప్రముఖులు వస్తూ ఉంటారు.. వెళ్తూ ఉంటారు. కానీ, బ్రహ్మానందం స్థానాన్ని మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు. అంతటి ప్రత్యేకమైన స్థానాన్ని ప్రేక్షకుల మదిలో ఏర్పాటు చేసుకున్నారు బ్రహ్మానందం. ఇక సోషల్ మీడియా హావ మొదలైన తర్వాత.. ఎక్కడ చూసినా బ్రహ్మానందం ఫొటోలే కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి మీమర్స్ పాలిట దేవుడు అయిపోయారు బ్రహ్మి. సోషల్ మీడియాలోని మీమర్స్ అంతా బ్రహ్మానందంను ముద్దుగా మీమ్ గాడ్ అని పిలుచుకుంటారు. ఇప్పటివరకు తెలుగు భాషలో అందరిని నవ్వించిన బ్రహ్మానందం.. ఇప్పుడు నేపాలీ కూడా నటించబోతున్నారు. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్బంగా ఆ వివరాలను విడుదల చేశారు. ఆయన నటిస్తోన్న మొదటి తెలుగు, నేపాలీ సినిమాను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాగే ఈ నేపాలీ చిత్రానికి ‘హ్రశ్వ దీర్ఘ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో హరిహర అధికరి, నీతా దుంగన ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే.. ఇన్నాళ్లు థియేటర్లలో అందరిని నవ్వించిన బ్రహ్మానందం.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. బ్రహ్మి నటిస్తున్న ఓటీటీ ఏంట్రీ మూవీకి “VVY” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ, “VVY” అంటే ఏమిటో మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో.. జూలై 18న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సరికొత్త చిత్రానికి అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతోనే అనురాగ్ దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నారు. కాగా ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, బ్రహ్మానందం సరికొత్త చిత్రాలపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet