iDreamPost
android-app
ios-app

మంచి మనసు చాటుకున్న బేబీ మూవీ నిర్మాత SKN

  • Published Jul 29, 2023 | 4:59 PM Updated Updated Jul 29, 2023 | 4:59 PM
  • Published Jul 29, 2023 | 4:59 PMUpdated Jul 29, 2023 | 4:59 PM
మంచి మనసు చాటుకున్న బేబీ మూవీ నిర్మాత SKN

ఇటీవల చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న మూవీ బేబీ. ఇందులో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించగా.., వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సాయి రాజేష్ కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించగా నిర్మాత SKN (శ్రీనివాస్ కుమార్) తెరకెక్కించారు. ఈ చిత్రం సంచలన విజయంతో నిర్మాత SKN ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచాడు.

అయితే ఆయన గతంలో రొమాన్స్, ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, టాక్సీవాలా తాజాగా బేబీ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇలా విభిన్నమైన సినిమాలను తెరకెక్కిండంలో నిర్మాత SKN దిట్టా అనే చెప్పాలి. ఇక అనుకున్నది సాధించిన ఆయన ఇప్పుడు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. నిర్మాత SKN తాజాగా మంచి మనసు చాటుకున్నాడు. విషయం ఏంటంటే? ఓ నెటిజన్ సోషల్ మీడియాలో.. తన తల్లికి కడుపులో ఇన్ ఫెక్షన్ వచ్చింది. బ్లాడర్ లో స్టోన్స్ కూడా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. చికిత్స కోసం దాదాపు రూ. 1 లక్షా 50 వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కష్టపడి లక్ష వరకు సమకూర్చాను. కానీ, ఇంకా రూ.50 వేలు కావాలి. ఎవరైనా హెల్ప్ చేయండి.. అంటూ ట్విట్టర్ లో ఆ యువకుడు ఓ పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ ను బేబీ నిర్మాత SKN చదివి నేనున్నానంటూ సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అతడు ఎవరు, ఏంటి, ఇదంతా నిజమేనా అనే విషయాలు ఏవి తెలుసుకోకుండా వెంటనే ఆన్ లైన్ లో అతడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అతని బ్యాంక్ వివరాలు తెలుసుకుని ఆ యువకుడికి రూ.50 వేలు సెండ్ చేశారు. ఇక డబ్బు ట్రాన్స్ ఫర్ చేసిన మనీ రిసిప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చదివిన చాలా మంది SKN మంచి మనసు చాటుకున్నాడని మెచ్చుకుంటున్నారు. బేబీ నిర్మాత మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: బేబీ నిడివి 3 గంటల పైకి! డ్యూరేషన్ పెంచుతున్న మేకర్స్!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss