రీరిలీజ్ కలెక్షన్స్ లో గబ్బర్ సింగ్ రికార్డ్ బ్రేక్ ..

Gabbar Singh Re Release Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా.. థియేటర్స్ లో గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ చేసిన సంగతి తెలిసందే. ఫ్యాన్స్ అంతా దీనిని ఒక పండగలా సెలెబ్రేట్ చేసుకున్నారు. మరి ఈ మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూసేద్దాం.

Gabbar Singh Re Release Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా.. థియేటర్స్ లో గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ చేసిన సంగతి తెలిసందే. ఫ్యాన్స్ అంతా దీనిని ఒక పండగలా సెలెబ్రేట్ చేసుకున్నారు. మరి ఈ మూవీ ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూసేద్దాం.

ప్రస్తుతం థియేటర్స్ లో స్ట్రైట్ సినిమాలతో పాటు.. రీరిలీజ్ సినిమాలు కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలలో మురారి మూవీ అటు రీరిలీజ్ ప్రమోషన్స్ లోను.. కలెక్షన్స్ లోను ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేసేలా. గబ్బర్ సింగ్ బరిలోకి దిగింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా థియేటర్స్ లో.. గబ్బర్ సింగ్ మూవీని రీరిలీజ్ అయింది. ఫ్యాన్స్ దీనిని ఒక పండగల జరుపుకున్నారు.. రిలీజ్ కు ముందే బుకింగ్స్ విషయంలో… భారీ బజ్ క్రియేట్ చేసింది. మరి రిలీజ్ తర్వాత ఇప్పటివరకు ఎంత కలెక్షన్ రాబట్టిందో చూసేద్దాం.

రీరిలీజ్ కు ముందు వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఈ సినిమా కోసం అందరు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. కానీ సరిగ్గా అదే సమయంలో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. కాస్త జోష్ తగ్గిందని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమాకు మొత్తం 3 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడు పోయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజం లో ఈ మూవీ సుమారుగా 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికా , కెనడాలో మొత్తం 116 లొకేషన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయగా.. యూఎస్ లో 6000 డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో 50 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 53 సెంట్లర్లలో 335 హాల్స్ లో 1431 షోస్ ప్రదర్శించగా.. 5.26 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. మిగిలిన రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి.. వరల్డ్ వైడ్ గబ్బర్ సింగ్ రీరిలీజ్ మూవీ.. 6 కోట్లకుపైగా షేర్ సాధించింది.

ఒకవేళ వర్షాలు కనుక లేకుండా ఉండి ఉంటే.. కలెక్షన్స్ రికార్డ్స్ మరోలా ఉండి ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇలా రీరిలీజ్ లలో కూడా ట్రెండ్ సెట్ చేయడం కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే సాధ్యం అని.. మరొకసారి ఈ మూవీతో ప్రూవ్ అయింది. ఇప్పటికే చాలా సినిమాలు రీరిలీజ్ కు రెడీ గా ఉన్నట్లు సమాచారం. మరి తర్వాత రాబోయే రీరిలీజ్ లు ఏంటో.. అవి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి ఈ సినిమా రీరిలీజ్ కలెక్షన్స్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Show comments