iDreamPost
android-app
ios-app

బేబీ సినిమాపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి

  • Published Jul 28, 2023 | 9:53 PM Updated Updated Jul 28, 2023 | 9:53 PM
  • Published Jul 28, 2023 | 9:53 PMUpdated Jul 28, 2023 | 9:53 PM
బేబీ సినిమాపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి

బేబీ.. ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామీని కొల్లగొడుతోందీ చిత్రం. చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో ఏకంగా బడా సినిమాల రికార్డును సైతం చెరిపేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. కేవలం రిలీజైన 12 రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక ఈ సినిమా నటీ, నటులను, దర్శక, నిర్మాతల పనీ తీరుపై టాలీవుడ్ లో ఎందరో ప్రముఖులు మెచ్చుకుని అభినందించారు. అందులో అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మెగస్టార్ చిరంజీవి బేబీ మూవీ దర్శక, నిర్మాతలను మెచ్చుకున్నారు. ఇంతే కాకుండా వారిని తన ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో సరిపెట్టకుండా బేబీ చిత్రం దర్శక, నిర్మాతలో ఏకంగా 2 గంటల పాటు మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.. చిరంజీవి కోసం బేబీ మూవీ యూనిట్ ఓ స్పెషల్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారట.

ఇందులో ఈ మూవీ సక్సెస్ మీట్ తో నటీ, నటులను ప్రశంసించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో చిరంజీవితో దిగిన ఫొటోలను జత చేస్తూ ఓ ఎమోషన్ పోస్ట్ చేశారు. అందులో ఏముందంటే?.. నా కల నిజమే వేళ.. నా దేవుడితో రెండు గంటల పాటు ఉన్నాను. బీబీ మూవీకి పని చేసిన ప్రతీ విభాగాన్ని చిరంజీవి గారు మెచ్చుకున్నారు. రెండు గంటలు బాబాయ్, రెండు గంటలు. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణం. బాస్ నాతో మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి అంటూ దర్శకుడు సాయి రాజేష్ రాసుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Sai Rajesh (@sairazesh)

ఇది కూడా చదవండి: OTTలోకి ‘రంగబలి’.. స్టీమింగ్ ఎందులో? ఎప్పటినుంచంటే?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet