iDreamPost
android-app
ios-app

భోళా శంకర్ మూవీకి పారితోషికం తీసుకోని చిరు! అసలు విషయం ఏంటంటే?

  • Published Jul 28, 2023 | 8:49 PM Updated Updated Jul 28, 2023 | 9:55 PM
  • Published Jul 28, 2023 | 8:49 PMUpdated Jul 28, 2023 | 9:55 PM
భోళా శంకర్ మూవీకి పారితోషికం తీసుకోని చిరు! అసలు విషయం ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇప్పుడు యంగ్ హీరోలకు గట్టి పొటీనిస్తునారు. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ తెగ బిజీగా మారిపోయారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో విడులైన వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు చిరు. ఇక ఇదే జోష్ కంటిన్యూ చేస్తూ మరో హిట్ ను అందుకోవాలని అనుకుంటున్నారట మన మెగాస్టార్. ఇదిలా ఉంటే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రస్తుతం చిరు నటిస్తోన్న మూవీ భోళా శంకర్.

ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో వీరితో పాటు హీరో సుశాంత్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ ఇటీవలె విడుదలై యూట్యూబ్ లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఇదే సమయంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. భోళా శంకర్ సినిమాకి చిరంజీవి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది.

మేకర్స్ అనుకున్నదాని కంటే ఎక్కువే ఇస్తమన్నా చిరు వద్దన్నారంట. కానీ, ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? భోళా శంకర్ చిత్రంలో వాటా కావాలని చిరంజీవి అడిగినట్లు తెలుస్తోంది. మూవీ రిలీజైన తర్వాత వచ్చిన లాభాల్లో చిరుకు ఇవ్వడానికి మేకర్స్ కూడా అంగీకరించినట్లు సమాచారం. మరి ఈ వార్తలో నిజం ఎంతుందనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఇకపోతే రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి పెరిగిపోతున్నాయి. ట్రైలర్ కూడా బాగుండడంతో ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: స్టార్ హీరోయిన్​పై బాడీ షేమింగ్​ కామెంట్స్.. ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ..!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş