iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోయిన్​పై బాడీ షేమింగ్​ కామెంట్స్.. ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ..!

  • Author singhj Published - 07:13 PM, Fri - 28 July 23
  • Author singhj Published - 07:13 PM, Fri - 28 July 23
స్టార్ హీరోయిన్​పై బాడీ షేమింగ్​ కామెంట్స్.. ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ..!

సినీ తారల జీవితం ఎంతో అందంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. రూ.కోట్లు సంపాదిస్తూ విలాసవంతంగా బతుకుతారనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కొందరు స్టార్ల విషయంలో ఇది నిజమే కావొచ్చు. కానీ అందరి జీవితాలూ ఇలాగే ఉంటాయని చెప్పలేం. సాధారణ మనుషుల్లాగే వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి. ఒక్క హిట్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్లు అయిపోయిన హీరోయిన్లు.. ఓ ఫ్లాప్ పడితే కనిపించకుండా పోవచ్చు. పరిశ్రమలో ఉన్న తీవ్ర పోటీని తట్టుకుంటూ, గ్లామర్​ను కాపాడుకుంటూ సక్సెస్ అవ్వడం అంటే మాటలా? ఇన్ని చేసినా వారికి విమర్శలు తప్పవు. స్క్రీన్​ మీద, బయట నవ్వుతూ, గ్లామర్​తో ఎంటర్​టైన్ చేసే హీరోయిన్లకు కొన్నిసార్లు చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి.

హీరోయిన్లపై ఈమధ్య కాలంలో ట్రోలింగ్ చేయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా వారి మీద బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. కొందరు నెటిజన్స్ పనిగట్టుకొని ఆ ముద్దుగుమ్మల్ని వేధిస్తుంటారు. సోషల్ మీడియా కల్చర్ పెరిగిన అనంతరం ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడో స్టార్ హీరోయిన్ తనకు ఎదురైన బాడీ షేమింగ్ గురించి బయటపెట్టారు. బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి గురించి వినే ఉంటారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్​’తో ఆమె హిందీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు బోల్డ్ క్యారెక్టర్స్​తో ఫేమస్ అయిపోయారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్​లోనూ నటిస్తూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘కాలా’, అజిత్ పక్కన ‘వలిమై’ చిత్రాలతో సౌత్ ఆడియెన్స్​నూ హ్యూమా తన నటనతో అలరించారు.

ఒక సినిమా రిలీజ్ తర్వాత నటనను పక్కనబెట్టి తన బరువు గురించి ఒక రివ్యూయర్ కామెంట్ చేశారని హ్యూమా ఖురేషి అన్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేస్తూ బాధపడ్డారామె. సినిమా నచ్చలేదంటే సమస్య లేదని, అది వారి ఛాయిస్ అని.. కానీ కొందరు ఎందుకు వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తారని హ్యూమా ప్రశ్నించారు. తనకు ఇలా చాలాసార్లు జరిగిందన్నారు. ‘నేను నటించిన ఒక మూవీ రిలీజ్ తర్వాత రివ్యూయర్ నా బరువు గురించి రాశారు. హీరోయిన్లకు ఉండాల్సిన దానికంటే ఐదు కేజీలు ఎక్కువగా ఉన్నానని చెప్పారు. దీంతో నాలో ఏదైనా లోపం ఉందా అనే సందేహం వచ్చింది. అది రివ్యూలా లేదు.. పర్సనల్​గా టార్గెట్ చేసి కిందకు లాగినట్లు ఉంది’ అని హ్యూమా ఆవేదన బయటపెట్టారు. ఇది తెలిసిన నెటిజన్స్.. స్టార్ హీరోయిన్​కే ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటని అంటున్నారు.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş