iDreamPost
android-app
ios-app

Adipurush: ప్రభాస్ క్రేజ్ అంటే ఇది.. ఆదిపురుష్ దెబ్బకి Book My Show సర్వర్లు క్రాష్!

  • Author Soma Sekhar Published - 04:23 PM, Thu - 15 June 23
  • Author Soma Sekhar Published - 04:23 PM, Thu - 15 June 23
Adipurush: ప్రభాస్ క్రేజ్ అంటే ఇది.. ఆదిపురుష్ దెబ్బకి Book My Show సర్వర్లు క్రాష్!

ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆదిపురుష్ మేనియానే కనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రఘురాముడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ మరికొన్ని గంటల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ బాషలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే అడ్వాన్స్ బుకింగ్స్  ప్రారంభం అయ్యాయి. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా బుకింగ్స్ కోసం ఎగబడ్డారు. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి సర్వర్లు క్రాష్ అయ్యాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆదిపురుష్.. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో రాముడిగా కనిపించబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సీతగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తుండగా.. డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. కాగా విడుదలకు రెండు రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ Book My Show తో పాటుగా పీవీఆర్, పేటీఎం లాంటి వెబ్ సైట్స్ లో టికెట్స్ పెట్టిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఒక్కసారిగా లాగిన్ అవ్వడంతో.. బుక్ మై షో సర్వర్లు క్రాష్ అయ్యాయి. దాంతో సంస్థ యజమానులు అలర్ట్ అయ్యి సర్వర్ల కెపాసిటీని పెంచుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కు మరికొన్ని గంటల టైమ్ ఉండటంతో.. భారీ స్థాయిలో బుకింగ్స్ జరగడం ఖాయాంగా కనిపిస్తోంది. ఈ రేంజ్ బుకింగ్స్ చూస్తుంటే.. RRR కలెక్షన్లు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ తప్పితే ఆదిపురుష్ టీమ్ ఎలాంటి ప్రమోషన్స్ ను చేపట్టలేదు. కేవలం ప్రభాస్ మేనియాతోనో ఇది సాధ్యం అవుతోంది అన్నది కాదనలేని సత్యం.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet