Tirupathi Rao
Javed Akthar On Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాపై బాలీవుడ్ పెద్దల ముఠా ఇంకా దాడి చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి జావెద్ అక్తర్ యానిమల్ మూవీపై బురద జల్లే ప్రయత్నం చేసి దొరికిపోయాడు.
Javed Akthar On Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాపై బాలీవుడ్ పెద్దల ముఠా ఇంకా దాడి చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి జావెద్ అక్తర్ యానిమల్ మూవీపై బురద జల్లే ప్రయత్నం చేసి దొరికిపోయాడు.
Tirupathi Rao
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు వింటే బాలీవుడ్ లో చాలామందికి వణుకుపుడుతోంది. కొంతమంది లోలోపల కుళ్లుకుంటూ ఉంటే.. ఇంకొంత మంది మాత్రం పైకి ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ అంటే ఏంటో వాళ్లకి ఒక తెలుగు డైరెక్టర్ చూపించే సరికి జీర్ణించుకోలేకపోతున్నారు. యానిమల్ సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇప్పించడం నుంచి అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. కానీ, యానిమల్ సినిమా రూ.900 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ రైటర్ గా చెప్పుకునే జావెద్ అక్తర్ మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు. తన కొడుకు మీర్జాపూర్ సిరీస్ ని ప్రశ్నించగానే.. సందీప్ పై ఆగ్రహంతో ఊగిపోయాడు.
యానిమల్ సినిమాపై బాలీవుడ్ లో బాగానే నిరసన సెగలు వచ్చాయి. చాలామంది బడా బడా హీరోలుగా, నిర్మాతలుగా, క్రిటిక్స్ గా చలామణి అయ్యే వాళ్లంతా సందీప్ సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆడవాళ్లని చులకన చేశాడు అని.. వైలెన్స్ తో ఆడియన్స్ ని ఆగం చేస్తున్నాడు అంటూ కడుపుమంటను వెళ్లగక్కారు. అందులో భాగంగానే జావెద్ అక్తర్ కూడా యానిమల్ సినిమాపై విమర్శలు చేశారు. అసలు యానిమల్ సినిమా చూడకుండానే జావెద్ అక్తర్ విమర్శలు చేయడం కొసమెరుపు. దానికి సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తన కొడుకు నిర్మించిన మీర్జాపూర్ సిరీస్ ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించాడు. మీర్జాపుర్ సిరీస్ మొత్తం బూతులే అంటూ కామెంట్స్ చేశాడు. అలాంటి సిరీస్ ని వదిలేసి తన సినిమాపై కామెంట్స్ చేస్తున్నాడంటూ కౌంటర్ ఇచ్చాడు.
సందీప్ ఆన్సర్ తో జావెద్ అక్తర్ డిఫెన్స్ లో పడిపోయాడు. అటు కొడుకుని కవర్ చేసే ప్రయత్నంలో మరోసారి సందీప్ రెడ్డి వంగాపై నోటి దురుసు ప్రదర్శించాడు. “నా 53 ఏళ్ల కెరీర్ లో తనకు ఏ తప్పు దొరకలేదు. అందుకే నా కుమారుడి గురించి మాట్లాడుతున్నాడు. నేను యానిమల్ సినిమా తీసినందుకు డైరెక్టర్ ని ఏమీ అనడం లేదు. అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు. అతను ఒకటి కాకపోతే ఎన్ని యానిమల్స్ అయినా తీయచ్చు. నా బాధ అంతా ఆడియన్స్ గురించే. నేను యానిమల్ సినిమా చూడలేదు. వాళ్లు వీళ్లు చెప్పిన మాటలను బట్టి కామెంట్స్ చేశాను. అతను స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది.
నా 53 ఏళ్ల కెరీర్ లో ఒక సినిమా, ఒక స్టోరీ, ఒక డైలాగ్, ఒక సీన్ కనిపెట్టలేకపోయాడు. అందుకే నా కొడుకును ఇందులోకి లాగాడు. ఆ సిరీస్ స్టోరీ నా కొడుకు రాయలేదు, నా కొడుకు యాక్ట్ చేయలేదు, నా కొడుకు కంపెనీ దానిని నిర్మించింది. వాళ్ల కంపెనీ చాలానే చిత్రాలు చేస్తోంది. నా కెరీర్ లో ఒక్క తప్పు వెతకలేకపోయావా..” అంటూ జావెద్ అక్తర్ వ్యాఖ్యలు చేశాడు. అయితే దేశం మొత్తం మెచ్చుకున్న.. మూవీ ఆఫ్ ది డికేడ్ అంటూ నెత్తిన పెట్టుకున్న సినిమాపై ఈ బాలీవుడ్ వాళ్ల కడుపు మంట ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అవకాశం లేకపోయినా సందీప్ పై విమర్శలు చేస్తున్నారు. వీళ్లకు అర్థంకాని విషయం ఏంటటేం.. ఎంత తొక్కాలని చూస్తే సందీప్ రెడ్డి వంగా అంత పైకి లేస్తాడు. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయిన జావెద్ అక్తర్ మరోసారి సందీప్ రెడ్డి వంగా స్పందిస్తే తట్టుకోలడో లేద.. చూడాలి. మరి.. సినిమా కూడా చూడకుండా బాలీవుడ్ పెద్దలుగా చలామణి అయ్యేవాళ్లు ఇలాంటి విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.