iDreamPost
android-app
ios-app

నాటు నాటు పాటకి డ్యాన్స్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్స్

  • Published Mar 03, 2024 | 3:09 PM Updated Updated Mar 03, 2024 | 4:14 PM

ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాగా ఈ వేడుకలలో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టేజి పై డ్యాన్స్ చేయటం హైలెట్ గా నిలిచింది.

ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాగా ఈ వేడుకలలో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టేజి పై డ్యాన్స్ చేయటం హైలెట్ గా నిలిచింది.

  • Published Mar 03, 2024 | 3:09 PMUpdated Mar 03, 2024 | 4:14 PM
నాటు నాటు పాటకి డ్యాన్స్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్స్

ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాగా ఈ వేడుకలలో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టేజి పై డ్యాన్స్ చేయటం హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకదాని తర్వాత ఒకటిగా వార్తలు వస్తున్నాయి. ఆ హంగామా, భారీ ఖర్చును చూసి పబ్లిక్ ఔరా అంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సినీ తారలు, హాలీవుడ్ పాప్ స్టార్ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు, హిందీ చిత్ర పరిశ్రమలోని ముగ్గురు అతి పెద్ద సూపర్ స్టార్లు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ లు కలిసి డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న “నాటు నాటు” పాటకు ఈ ముగ్గురూ తమ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఈ ముగ్గురు స్టార్స్ కలిసి ఓకే వేదిక పై కనిపించారు. తమ అభిమాన తారలు కలిసి డ్యాన్స్ చేయడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రదర్శనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే కొందరు నేటిజన్లు ఆ పాటకి వారి డ్యాన్స్ అతకలేదని విమర్శించగా… మరికొందరు ఇది కాంపిటీషన్ కాదని సరదాగా ఆడిపాడిన సందర్భంలో ఇలా ఒరిజినల్ డ్యాన్స్ తో పోల్చటం సరికాదని అంటున్నారు. కాగా మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు నేటితో ముగియనున్నాయి. జులై 12న అనంత్, రాధికల వివాహం జరగనుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss