iDreamPost
android-app
ios-app

టాప్ సింగర్ కి అరుదైన వ్యాధి.. ఆ కారణంగా చెవుడు!

Alka Yagnik: తమకు వచ్చిన అరుదైన జబ్బుల గురించి కొందరు చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అలానే తాజాగా ఓ టాప్ సింగర్ కూడా తనకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది.

Alka Yagnik: తమకు వచ్చిన అరుదైన జబ్బుల గురించి కొందరు చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అలానే తాజాగా ఓ టాప్ సింగర్ కూడా తనకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది.

టాప్ సింగర్ కి అరుదైన వ్యాధి.. ఆ కారణంగా చెవుడు!

నేటికాలంలో అనేక రకాల వ్యాధులు మనుషుల్లో కనిపిస్తున్నాయి. కొన్ని రకాల వింత వ్యాధులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అలానే కొన్ని  అరుదైన వ్యాధులు కూడా కనిపిస్తుంటాయి. ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరికైన వ్యాధులు సోకుతుంటాయి. కాకపోతే…ప్రముఖలకు ఏదైనా వ్యాధి వస్తే.. సోషల్ మీడియాలో వైరల్  అవుతుంది. అలానే తమకు వచ్చిన అరుదైన జబ్బుల గురింతి చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అలానే తాజాగా ఓ టాప్ సింగర్ కూడా తనకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. అంతేకాక ఆ వ్యాధి కారణంగా చెవుడు కూడా వచ్చిందని తెలిపారు. ఇంతకీ ఆ సింగర్ ఎవరు, ఆ వివరాలు ఏమేటో ఇప్పుడు చూద్దాం..

ఎంతో మంది సింగర్ తమ గాత్రంతో శ్రోతలను అలరిస్తుంటారు. అలానే అనేక సినిమాల్లో పాటలు పాడి..తమ కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తారు. అయితే కొందరి విషయంలో దురదృష్టం కూడా వెంటాడుతుంది. టాప్ సింగర్ గా ఉన్న సమయంలోనే ఏదో ఒక కారణంగాతో డల్ అవుతుంటారు. కొందరిని అయితే  విచిత్రమైన వ్యాధులు సోకుతుంటాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ అల్కా యాగ్నిక్  అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఆ వ్యాధి కారణంగా ఆమెకు చెవుడు కూడా వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక తనకు వచ్చిన అరుదైన జబ్బు గురించి అల్కా మాట్లాడుతూ పలు విషయాలను షేర్ చేసుకుంది. కొంతకాలంగా తాను బయట కనిపించడంలేదని చాలా మంది అడుగుతున్నారని తెలిపింది.

అందుకు కారణం తాను ప్రస్తుతం అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అనే వ్యాధితో భాదపడుతున్నానని పేర్కొంది. కొన్ని వారాల క్రితమే తాను విమానం దిగి వస్తుంటే ఆ పరిసరాల్లోని శబ్దాలు ఏమి వినబడలేదని, అదే విషయాన్ని వైద్యులకు చెప్పగా..వారు తనకు సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ ఉందని చెప్పినట్లు ఆమె తెలిపింది.  వైరల్ ఎటాక్ వల్ల ఇలా జరిగిందని, ఆ ఘటనను తాను అస్సలు ఊహించలేదని అల్కా పేర్కొన్నారు. అంతేకాదు.. పెద్ద సౌండ్‌తో పాటలు వినడం, హెడ్ ఫోన్స్ వాడకం తగ్గించమని ఆమె తన ఫ్యాన్స్ కి సూచించారు. ఇక త్వరలోనే తాను కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని చెప్పుకొచ్చారు.

ఇక సింగర్ అల్కా యాగ్నిక్ విషయానికి వస్తే.. ఆమె గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90 దశకంలో అల్కా బాలీవుడ్ లో  టాప్ సింగర్ గా కొనసాగారు. అంతేకాక ఆ సమయంలో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఆమె పాటలను వినేదందుకు సంగీత ప్రియులు చెవులు కోసుకునే వారంటే అతిశయోక్తి కాదు. ఆమె మొత్తం 25 భాషల్లో  21 వేలకు పైగా పాటలు పాడారు. అంతాకక ఆమె చాలా సింగింగ్  కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవరించారు. అంతేకాదు.. 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్టుగా గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. మరి.. తాజాగా ఆమె చేసిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Alka Yagnik (@therealalkayagnik)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి