iDreamPost
android-app
ios-app

తెలుగు డైరెక్టర్ పై బాలీవుడ్ మీడియా అక్కసు! మళ్ళీ టార్గెట్!

సందీప్ వంగా డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం యానిమల్. దేశ వ్యాప్తంగా ఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, బాలీవుడ్ మీడియా తన అక్కసును మరోసారి చూపించింది. ఈ మూవీకి కేవలం 1.5, 1.7 వంటి తక్కువ రేటింగ్ ఇచ్చి ఈ చిత్రం సక్సెస్ పై తప్పుడు సంకేతాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది.

సందీప్ వంగా డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం యానిమల్. దేశ వ్యాప్తంగా ఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, బాలీవుడ్ మీడియా తన అక్కసును మరోసారి చూపించింది. ఈ మూవీకి కేవలం 1.5, 1.7 వంటి తక్కువ రేటింగ్ ఇచ్చి ఈ చిత్రం సక్సెస్ పై తప్పుడు సంకేతాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది.

తెలుగు డైరెక్టర్ పై బాలీవుడ్ మీడియా అక్కసు! మళ్ళీ టార్గెట్!

సందీప్ వంగా.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. 2017లో విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ సాధించిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయి కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ మూవీ హిట్ తో సందీప్ కు డైరెక్టర్ గా మంచి పేరు రావడంతో పాటు హీరోగా నటించిన విజయ్ దేవర కొండ సైతం టాప్ హీరోల లీస్టులో చేరిపోయారు. ఇక ఇదే సినిమాని సందీప్ వంగా 2019లో బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ కూడా భారీ విజయాన్నే నమోదు చేసుకుంది.

కానీ, డైరెక్టర్ సందీప్ వంగా తెలుగువాడు కావడంతో బాలీవుడ్ మీడియా పని గట్టుకుని మరీ ఈ చిత్రానికి తక్కువ రేటింగ్ ఇచ్చింది. అయినా సరే, కబీర్ సింగ్ భారీ విజయాన్ని నమోదు చేసుకుని బాలీవుడ్ మీడియాకు షాకిచ్చింది. ఇక సందీప్ వంగా దెబ్బతో అక్కడ మరోసారి తెలుగోడి సత్తా ఏంటో బాలీవుడ్ మీడియాకు తెలిసొచ్చింది. ఇదిలా ఉంటే.. సందీప్ వంగా తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్. ఇందులో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1 దేశ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా విజయంతో సందీప్ వంగా మరోసారి తన సత్తాను చూపించారు. అంచనాలను సైతం తలకిందులు చేస్తూ ఈ మూవీ భారీ వసూళ్లు సంపాదిస్తోంది.

అయితే సందీప్ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీపై బాలీవుడ్ మీడియా తన అక్కసును మరోసారి చూపించింది. ఈ మూవీకి కేవలం 1.5, 1.7 వంటి తక్కువ రేటింగ్ ఇచ్చి ఈ మూవీ సక్సెస్ పై తప్పుడు సంకేతాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది. అయినా సరే ఈ లెక్కలను పట్టించుకోని అక్కడి సినీ అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే, మొదటి రోజే యానిమల్ చిత్రం దేశ వ్యాప్తంగా రూ. 71 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులను సైతం తిరగ రాస్తోంది. తెలుగు డైరెక్టర్ తెరకెక్కించిన యానిమల్ మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. దీని కారణంగానే యానిమల్ చిత్రానికి గాను అతి తక్కువ రేటింగ్ ఇచ్చి తెలుగోడైన డైరెక్టర్ సందీప్ పై మరోసారి పగ తీర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగడు తెరకెక్కించిన మూవీ విజయాన్ని బాలీవుడ్ మీడియా జీర్ణించుకోలేకపోవడం దుర్మార్గమైన చర్య అని, ఇకనైన బుద్ది మార్చుకుని నిజాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు సినీ క్రిటిక్స్ సూచిస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet