iDreamPost
android-app
ios-app

కల్కి, దేవర, పుష్ప రేంజ్‌కి కన్నప్ప! మరో స్టార్ హీరో వచ్చేశాడు!

  • Published Apr 08, 2024 | 5:43 PM Updated Updated Apr 08, 2024 | 5:43 PM

మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూవీ కన్నప్ప. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సర్య్కులేట్ అవుతోంది. కల్కి, దేవర సినిమాల స్థాయిలో..

మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూవీ కన్నప్ప. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సర్య్కులేట్ అవుతోంది. కల్కి, దేవర సినిమాల స్థాయిలో..

  • Published Apr 08, 2024 | 5:43 PMUpdated Apr 08, 2024 | 5:43 PM
కల్కి, దేవర, పుష్ప రేంజ్‌కి కన్నప్ప! మరో స్టార్ హీరో వచ్చేశాడు!

మా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యాడు మంచు విష్ణు. గత ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్లకు ఏమాత్రం తీసిపోలేదు. కానీ ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంది కమిటీ. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తన కలల ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు మంచువారబ్బాయి. కన్నప్ప సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. న్యూజిలాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి విదితమే. సెకండ్ షెడ్యూల్ కూడా అక్కడే స్టార్ చేశారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా..ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి విదితమే. ఈ ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. కల్కి, దేవర సినిమా స్థాయిలో కాస్ట్, కాస్టింగ్, విజువల్ వండర్‌గా రూపు దిద్దుకుంటుంది ఈ మూవీ.

గతంలో ఆథ్యాత్మిక సీరియళ్లకు దర్శకత్వం వహించిన ముఖేశ్ సింగ్ యాదవ్ కన్నప్పను డైరెక్ట్ చేస్తున్నాడు. ఏవీఏ ఎంటర్ టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు నిర్మాత మంచు మోహన్ బాబు. పరుచూరి గోపాల కృష్ణ, నాగేశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్ కథ అందించారు. స్టీఫెన్ దేవస్సీ, మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. హీరోయిన్‌గా చివరకు మోడల్ కమ్ నటి ప్రీతి ముకుందన్ కన్ఫమ్ అయ్యింది. ఇక ఇందులో కాస్టింగ్ చూస్తే బిత్తరపోవడం ఖాయం. అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పనిచేస్తుండటం విశేషం. రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో శివుడిగా కనిపించబోతున్నాడని టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

మోహన్ లాల్, మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మనందం, మధుబాల, ఐశ్వర్య భాస్కరన్, ముకేష్ రుషి ఇలా పెద్ద పెద్ద స్టార్లే నటిస్తున్నాడు. నయనతార, కంగనా రనౌత్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే కన్నడ నుండి శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అతడి ప్లేసులో మరో స్టార్ హీరో వచ్చి చేరుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్పలో నటించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్టులోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టైగర్ ష్రాఫ్‌తో బడేమియా ఛోటే మియా సినిమా చేయగా.. విడుదలకు రెడీ అవుతోంది. వీరిద్దరూ ప్రమోషన్లతో హంగామా చేస్తున్నారు  వీరిద్దరూ. ఈ మూవీ రిలీజ్ అయిన వెంటనే కన్నప్ప షూటింగ్‌లోకి రాబోతున్నాడట అక్షయ్. ఎప్పటి నుండో తెలుగు మూవీ చేయాలని ఆశ పడుతుండగా.. ఇప్పుడు ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique