Nidhan
Jr NTR, Devara Movie, Bollywood: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దూసుకొస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పాత రికార్డుల దుమ్ము దులిపేందుకు ‘దేవర’తో సిద్ధమవుతున్నాడు తారక్. తెలుగు నాటే కాదు.. నార్త్‌లోనూ వసూళ్ల వర్షం కురిపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
Jr NTR, Devara Movie, Bollywood: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దూసుకొస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. పాత రికార్డుల దుమ్ము దులిపేందుకు ‘దేవర’తో సిద్ధమవుతున్నాడు తారక్. తెలుగు నాటే కాదు.. నార్త్‌లోనూ వసూళ్ల వర్షం కురిపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
Nidhan
కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉన్న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దూసుకొస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. పాత రికార్డుల దుమ్ము దులిపేందుకు ‘దేవర’ మూవీతో సిద్ధమవుతున్నాడు తారక్. తెలుగు నాటే కాదు.. నార్త్‌లోనూ వసూళ్ల వర్షం కురిపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే జోష్‌లో ఉన్నాడు. ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ బ్లాక్‌బస్టర్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నార్త్‌లో జెండా పాతేందుకు సన్నద్ధం అవుతున్నాడు. అందులో భాగంగానే ప్రమోషన్స్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ట్రైలర్‌ను కూడా హిందీ ప్రమోషన్స్ టైమ్‌లోనే రిలీజ్ చేశాడు. అయితే ‘దేవర’ ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్, తారక్ మీద అక్కడి ఆడియెన్స్ చూపిస్తన్న ప్రేమను తట్టుకోలేని బాలీవుడ్ ఆయనపై విషం చిమ్మడం మొదలుపెట్టేసింది. ఎన్టీఆర్ టార్గెట్‌గా కుట్ర స్టార్ట్ చేసింది.
తారక్ పై కుట్ర మొదలుపెట్టిన బాలీవుడ్.. ఆయన్ను టార్గెట్ చేసుకొని నెగెటివ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే బీ-టౌన్ మీడియాకు చెందిన ఓ జర్నలిస్ట్ ఎన్టీఆర్ మీద దిగజారుడు కామెంట్స్ చేశాడు. తాను ‘దేవర’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు అటెండ్ అయ్యానని చెప్పిన ఆ జర్నలిస్ట్.. అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అవమానం జరిగిందన్నాడు. అభిమానుల్ని వెనుక సీట్లలో కూర్చోబెట్టారని చెప్పాడు. ముందు వరుసలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూర్చోబెట్టి.. వాళ్లతో జై ఎన్టీఆర్ అంటూ స్లోగన్స్ ఇప్పించారని తెలిపాడు. ఇదంతా పెయిడ్ ప్రమోషన్స్‌లో భాగమంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు. ట్రైలర్‌లోని డైలాగ్స్ తమకు వినిపించలేదని, ఫస్ట్ రోలో కూర్చున్న వారు బిగ్గరగా అరుస్తూ గోల చేయడమే దీనికి కారణమని ఆరోపించాడు. ఎవరు ప్రశ్నలు అడగాలనేది యాంకర్ డిసైడ్ చేశారని.. ఆ రిపోర్టర్స్‌తో తాము చెప్పిన క్వశ్చన్స్ అడిగించారంటూ చెత్త కామెంట్స్ చేశాడు.
ఈ ఆరోపణలపై తారక్ అభిమానులతో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ సీరియస్ అవుతున్నారు. కెరీర్లో ఎన్టీఆర్ చూడని సక్సెస్ లేదు.. నూనుగుమీసాల వయసులోనే వరుస సూపర్ హిట్స్‌తో టాప్ స్టార్‌గా అవతరించాడని అంటున్నారు. క్రేజ్, పాపులారిటీలో ఆయనకు ఆయనే సాటి అని.. అలాంటి వ్యక్తి పెయిడ్ ప్రమోషన్స్ చేశాడని చెప్పడానికి నోరు ఎలా వచ్చిందంటూ సీరియస్ అవుతున్నారు. తన సినిమాతోనే దిమ్మతిరిగే జవాబు ఇస్తాడని.. ఇలాంటి చెత్త పనులు మానుకోవాలంటూ బాలీవుడ్‌పై ఫైర్ అవుతున్నారు. హిందీలో ఇతర హీరోలను అంత ఈజీగా సెట్ కానివ్వరని.. తమను దాటిపోతాడనే భయంతో విషం చిమ్ముతుంటారని, అందులో భాగంగానే ఈ స్థాయికి దిగజారారని చెబుతున్నారు. తారక్‌పై నెగెటివ్ క్యాంపెయిన్‌లో భాగంగానే ఇలా విమర్శలు చేయిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ మొత్తం ఉదంతంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Jr.NTR Paid people in Mumbai Devara Event to give Jai NTR Slogans and Gave Front Seat to Social Media Influencers to Promote his Film.
– Mumbai Based Journalist pic.twitter.com/uULTvGG2CF
— Ujjwal Reddy (@HumanTsunaME) September 11, 2024