iDreamPost
android-app
ios-app

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్.. నటి హేమ అరెస్ట్ తప్పదా?

  • Published Sep 12, 2024 | 10:56 AM Updated Updated Sep 12, 2024 | 12:53 PM

Bangalore Rave Party Case: బెంగుళూరు సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో మే 15న నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి పలువురు సెలబ్రెటీలు, మోడల్స్ ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలీసులు నటి హేమను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలసిందే.

Bangalore Rave Party Case: బెంగుళూరు సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో మే 15న నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి పలువురు సెలబ్రెటీలు, మోడల్స్ ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలీసులు నటి హేమను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలసిందే.

  • Published Sep 12, 2024 | 10:56 AMUpdated Sep 12, 2024 | 12:53 PM
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్.. నటి హేమ అరెస్ట్ తప్పదా?

బెంగుళూరు సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో మే 15న నిర్వహించిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి పలువురు సెలబ్రెటీలు, మోడల్స్ ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో తెలుగు నటి హేమ కూడా ఉంది. అయితే తాను అక్కడ లేనని హైదరాబాద్ లో ఓ ఫామ్ హౌజ్ లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే నటి హేమకు సంబంధించిన కీలక విషయాలు బెంగుళూరు పోలీసులు బయటపెట్టారు.  ఆమెతో పాటు 88 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ హేమకు షాక్ ఇచ్చారు. తాజాగా బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రేవ్ పార్టీ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు బెంగుళూరు పోలీసులు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ తాజాగా 1086 పేజీల చార్జిషీట్ ని కోర్టుకు సమర్పించారు. అందులో నటి హేమ ఎండీఎంఏ సేవించినట్లుగా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్లెడ్ శాంపిల్స్ వెలువడిన ఫలితాలను జతపరిచారు. మే 15న బెంగుళూరు లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీకి హాజరైన నటి హేమకు టెస్టులు చేయగా మెడికల్ రిజల్ట్స్‌లో పాజిటీవ్ అని తెలియగానే అరెస్టు చేసి జైలుకు తరలించారు బెంగుళూరు పోలీసులు. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు నటి హేమ. కాగా, నటి హేమ.. వాసు, అరుణ్ అనే ఫ్రెండ్స్ ఆహ్వానం మేరకు రేవ్ పార్టీకి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. నటి హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు, పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పేర్కొన్నారు.

బెయిల్ పై విడుదలైన నటి హేమ తాను నిర్ధోషిని అంటూ కొన్ని రిపోర్ట్స్ పట్టుకొని ఎన్నో రకాలుగా ప్రచారం చేసింది. ఈ ఘటన తర్వాత నటి హేమపై ‘మా’ వేటు వేసింది. ఇటీవల ఆ నిషేదాన్ని ఎత్తివేసింది. ప్రస్తుతం సమసిపోతుందనుకున్న హేమ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరి నటి హేమను అరెస్ట్ చేస్తారా? లేదా? అన్న విషయంపై చర్చలు సాగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ విషయంపై స్పందించిన నటి హేమ ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు.. బెంగుళూరు పోలీసుల చార్జ్ షీట్ లో నాపేరు వచ్చినట్లు తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమే.. పోలీసుల చార్జ్ షీట్ నాకు వచ్చిన తర్వాత నేను దానిపై స్పందిస్తాను, నాకు ఉన్న సమాచారం వరకు డ్రగ్స్ రిపోర్ట్ లో నెగిటీవ్ అని చార్జ్ షీట్ లో వేశారు. MDMA డ్రగ్ నేను తీసుకోలేదు అని తెలిపింది.