డాక్టర్ కారనుకొని నమ్మా.. పక్కసీట్లోకూర్చుంటే చేతులేసి..: నటి

డాక్టర్ కారనుకొని నమ్మా.. పక్కసీట్లోకూర్చుంటే చేతులేసి..: నటి

డాక్టర్ కారు అనుకొని నమ్మి ఎక్కితే.. అందులో ఉన్న వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని షాకింగ్ విషయాలు వెల్లడించింది 'సీఏ టాపర్' నటి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

డాక్టర్ కారు అనుకొని నమ్మి ఎక్కితే.. అందులో ఉన్న వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని షాకింగ్ విషయాలు వెల్లడించింది 'సీఏ టాపర్' నటి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణ మహిళలకే కాదు.. సెలబ్రిటీలకు కూడా అప్పుడప్పుడు లైంగిక వేధింపులు తప్పవు. అయితే తాము ఎదుర్కొన్న ఈ చేదు సంఘటనలను సందర్భం వచ్చినప్పుడు ప్రపంచానికి తెలియజేస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటి తాను కూడా లైంగిక వేధింపులకు గురి అయ్యానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఓ కారు డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన తీరును చెప్పుకొచ్చింది.

తిలోతమా షోమ్.. బాలీవుడ్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్ గా సీఏ టాపర్ వెబ్ సిరీస్ లో మెరిసింది. ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదం కావడంతో.. ఈమెకు మరింత గుర్తింపు వచ్చింది. త్రిభువన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదిగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తిలోతమా తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇది తన లైఫ్ లో జరిగిన భయంకరమైన సంఘటనగా పేర్కొంది.

తిలోతమా షోమ్ మాట్లాడుతూ..”ఓ రోజు ఢిల్లీలో బస్సుకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతలో ఓ కారు వచ్చి నా దగ్గర ఆగింది. నేను భయంతో కొంచెం దూరం వెళ్లాలనుకున్నాను. కానీ నేను పరిగెత్తినా వాళ్లు నన్ను పట్టుకోగలరు. అందుకే రోడ్డు మధ్యలోకి వెళ్లి వచ్చే కార్లను లిఫ్ట్ అడిగా. చాలా మంది ఆపకుండానే వెళ్లిపోయారు. మెడికల్ గుర్తు ఉన్న కారు ఆపారు. నేను వెంటనే ఆ కారు ఎక్కి ముందు సీట్లో కూర్చున్నాను. కానీ.. కొంత దూరం వెళ్లాక, అతడు నా చేయి పట్టుకున్నాడు. అతడి ప్యాంట్ కూడా తీశాడు. నా చేయిని బలవంతంగా పట్టుకోవడంతో.. నేను అతడి భుజంపై కొట్టాను. వెంటనే అతడు కారు ఆపాడు. నేను స్పీడ్ గా కారు దిగేశాను. ఇది నా జీవితంలో జరిగిన అతి భయంకరమైన సంఘటన” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ రోజు నేను చూపిన ధైర్యమే.. నన్ను కాపాడింది అంటూ ఆమె పేర్కొంది. మెడికల్ గుర్తు ఉండటంతో.. డాక్టర్ అని నమ్మి ఆ కారు ఎక్కినట్లు ఆమె తెలిపింది.

Show comments