iDreamPost
android-app
ios-app

యంగ్ బిజినెస్​మెన్​తో స్టార్ హీరోయిన్ షికార్లు.. ఎవరో గుర్తుపట్టారా?

  • Published Aug 17, 2024 | 9:31 PM Updated Updated Aug 17, 2024 | 9:31 PM

Guess The Actress With Businessman: అందం, అభినయంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఓ నటి తాజాగా బైక్​పై షికార్లు కొడుతూ కనిపించింది. యంగ్ బిజినెస్​మెన్​తో ఆమె కలసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Guess The Actress With Businessman: అందం, అభినయంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఓ నటి తాజాగా బైక్​పై షికార్లు కొడుతూ కనిపించింది. యంగ్ బిజినెస్​మెన్​తో ఆమె కలసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

  • Published Aug 17, 2024 | 9:31 PMUpdated Aug 17, 2024 | 9:31 PM
యంగ్ బిజినెస్​మెన్​తో స్టార్ హీరోయిన్ షికార్లు.. ఎవరో గుర్తుపట్టారా?

ఫిల్మ్ సెలెబ్రిటీస్ ఏం చేసినా న్యూస్ అయిపోతుంది. వాళ్లకు ఉండే ఫాలోయింగ్ దృష్ట్యా ఇది సాధారణమే. స్టార్స్ కెరీర్​తో పాటు వాళ్ల పర్సనల్ లైఫ్​కు సంబంధించిన విశేషాలను తెలుసుకోవాలని ఆడియెన్స్​ ఉత్సాహం చూపిస్తుంటారు. ముఖ్యంగా సినీ తారల లవ్ లైఫ్, మ్యారేజ్​ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి న్యూస్ బయటకు వస్తే తెగ వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం ఓ హీరోయిన్​ ఇలాగే వైరల్ అవుతోంది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకుంటూ మంచి గుర్తింపు సంపాదించిన ఆ బ్యూటీ తాజాగా ఓ యంగ్ బిజినెస్​మెన్​తో కలసి బైక్​పై షికార్లు కొడుతూ కనిపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి. జిరోదా కంపెనీ కో-ఫౌండర్ నిఖిల్ కామత్​తో కలసి ముంబై వీధుల్లో రియా చక్కర్లు కొడుతూ కనిపించింది. దీంతో వీళ్లు రిలేషన్​షిప్​లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఇద్దరూ కలసి బైక్​పై షికార్లు చేస్తూ కనిపించడంతో వీళ్లు డీప్ లవ్​లో ఉన్నారని అంతా అంటున్నారు. ఇక, రియా చక్రవర్తి పేరు అప్పట్లో మీడియాలో బాగా వినిపించింది. హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య సమయంలో ఆమె పేరు వార్తల్లో వచ్చింది. ఆ తర్వాత ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. కొన్నాళ్లకు బెయిల్ మీద బయటకు వచ్చిన రియా.. కెరీర్​పై ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది.

ఈ ఏడాది మే నెలలో ‘చాప్టర్ 2’ అనే క్లాత్ బ్రాండ్​ను కూడా మొదలుపెట్టింది రియా చక్రవర్తి. జిరోదా కో-ఫౌండర్ నిఖిల్ కామత్​తో ప్రేమలో ఉందంటూ మరోసారి ఆమె పేరు మీడియాలో వచ్చింది. అయితే దీనిపై ఎవరూ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. కానీ తాజాగా బైక్​పై కలసి కనిపించడంతో రిలేషన్​షిప్​లో ఉన్నారనే దానికి ఇదే బిగ్ ప్రూఫ్​ అని అంటున్నారు. ఇక, నిఖిల్ కామత్​కు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. అయితే 2021లో అతడు డివోర్స్ తీసుకున్నాడు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్​తో కొన్నాళ్లు అతడు ప్రేమాయణం సాగించాడని వినిపించింది. పలు పార్టీల్లో రియాతో కలసి కనిపించడంతో ఆమెతో లవ్​లో ఉన్నాడనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా బైక్​పై కనిపించడంతో అది కన్ఫర్మ్ అని అంటున్నారు. కాగా, బైక్ రైడ్ టైమ్​లో నిఖిల్ కామత్ హెల్మెట్, మాస్క్ పెట్టుకొని కనిపించారు. రియా మాత్రం హెల్మెట్ లేకుండానే కనిపించారు.