iDreamPost
android-app
ios-app

ఇజ్రాయేల్ వార్ లో చిక్కుకున్న ఛత్రపతి హీరోయిన్! పరిస్థితి ఏంటి?

  • Author ajaykrishna Updated - 09:17 PM, Sun - 8 October 23
  • Author ajaykrishna Updated - 09:17 PM, Sun - 8 October 23
ఇజ్రాయేల్ వార్ లో చిక్కుకున్న ఛత్రపతి హీరోయిన్! పరిస్థితి ఏంటి?

హైఫీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచా.. ఇటీవల ఇజ్రాయేల్ దేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఆ దేశానికి, హమాస్ కి మధ్య భీకర యుద్ధం మొదలైంది. దీంతో హీరోయిన్ నుష్రత్ అక్కడే చిక్కుకుందని వార్తలు బయటికి వచ్చాయి. ఆ వార్త వినగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో.. నుష్రత్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఎప్పటికప్పుడు ఆమె గురించి అప్డేట్ కావాలని ఆరాలు తీయడం మొదలు పెట్టేశారు. ఓవైపు యుద్ధ విమానాల మధ్య దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో హీరోయిన్ సురక్షితంగా ఉందా లేదా? అనేది అసలు ప్రశ్న.

కట్ చేస్తే.. తాజాగా నుష్రత్ ఫ్యాన్స్ కి ఆమె పేరెంట్స్ గుడ్ న్యూస్ చెప్పినట్లు సమాచారం. నుష్రత్ కుటుంబ సభ్యులు.. ఆమె అక్కడ సేఫ్ గానే ఉందని తెలిపినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ నేషనల్ మీడియా సమాచారం ప్రకారం.. నుష్రత్ సురక్షితంగా ఎయిర్ పోర్ట్ ఉన్న ప్రాంతానికి చేరుకుందట. మరికొన్ని గంటలలో ఇజ్రాయేల్ నుండి ఫ్లైట్ లో బయలుదేరి.. రానుందని టాక్. ప్రస్తుతం ఇజ్రాయేల్ దేశంతో పాటు హమాస్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పటికే రాత్రుళ్ళు రాకెట్ దాడులు కూడా జరిపారని.. ప్రతీకారంగా దాడులు తీవ్రంగా మారాయని కథనాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయేల్, పాలస్తీనాకు మధ్య యుద్ధం జరుగుతుండగా.. ఓవైపు హీరోయిన్ నుష్రత్ చిక్కుకుందని వార్తలు బయటికి వచ్చాయి. ఈ విషయాన్ని కూడా నుష్రత్ టీమ్ మెంబర్ ఒకరు.. మీడియాకు ఇన్ఫర్మేషన్ అందించినట్లు తెలుస్తోంది. నుష్రత్ ఇజ్రాయేల్ లో చిక్కుకుందని.. చివరిగా ఆమె శనివారం మాట్లాడినట్లు చెబుతూ.. ఆమె నేలమాళిగలో సురక్షితంగా ఉన్నాన‌ని చెప్పినట్లు సదరు వ్యక్తి వెల్లడించాడట. ప్రస్తుతం నుష్రత్ ఇండియాకి రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈమె టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఇటీవల ఛత్రపతి హిందీ రీమేక్ లో నటించింది. మరి నుష్రత్ ప్రస్తుతం సేఫ్ అనే వార్త ఫ్యాన్స్ ని హ్యాపీ చేస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio