iDreamPost
android-app
ios-app

భార్యను రెండోసారి పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు.. ఎందుకంటే?

  • Published Dec 26, 2023 | 9:06 PM Updated Updated Dec 26, 2023 | 9:06 PM

58 ఏళ్ల వయసున్న బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ తన భార్య నీలం బోస్‌ రాయ్‌ను రెండోసారి వివాహాం చేసుకున్నారు. మరోసారి పెళ్లి చేసుకోని వార్తల్లో నిలిచారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

58 ఏళ్ల వయసున్న బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ తన భార్య నీలం బోస్‌ రాయ్‌ను రెండోసారి వివాహాం చేసుకున్నారు. మరోసారి పెళ్లి చేసుకోని వార్తల్లో నిలిచారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

  • Published Dec 26, 2023 | 9:06 PMUpdated Dec 26, 2023 | 9:06 PM
భార్యను రెండోసారి పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు.. ఎందుకంటే?

ఎవరీ జీవితంలో అయినా పెళ్లి అనేది ఓ మధురమైన అనుభూతి. పెళ్లి చేసుకునేందుకు యువతీ యువకులు ఎన్నో కలలు కంటుంటారు. తమకు కాబోయే వరుడు లేదా వధువు గురించి పదే పదే ఆలోచిస్తుంటారు. అయితే ఈ మధ్య లేటు వయసులో కూడా పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఏకంగా 40ఏళ్లు, 50 ఏళ్లు దాటిన వారు కూడా పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఇటీవల ఆశిష్ విద్యార్థి, నటుడు నరేష్ మరో సారి పెళ్లిల్లు చేసుకోని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో ఓ బాలీవుడ్ నటుడు మరోసారి వివాహమాడాడు. అయితే అతడు రెండో పెళ్లి చేసుకున్న విషయం వాస్తవమే కానీ అతడు పెళ్లాడింది మాత్రం అతడి భార్యనే. అసలు కారణం ఏంటంటే?

బాలీవుడ్ కు చెందిన నటుడు రోనిత్ రాయ్ మరోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టి వార్తల్లో నిలిచారు. 58 ఏళ్ల వయసున్న ఈ నటుడు తన భార్య నీలం బోస్‌ రాయ్‌ను రెండోసారి వివాహాం చేసుకున్నారు. కాగా గోవాలో జరిగిన ఈ వేడుక అత్యంత సంప్రదాయ బద్దంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా రోనిత్ రాయ్, ఆమన భార్య నీలం బోస్‌ రాయ్‌ దండలు మార్చుకుని అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశారు. ఈ సమయంలో, రోనిత్ తెలుపు రంగు కుర్తా-పైజామాలో కనిపించగా, అతని భార్య ఎరుపు రంగు డ్రెస్సులో చాలా అందంగా కనిపించింది. రోనిత్ రాయ్ పెళ్లికి సంబంధించిన వీడియోలను ఫొటోలను ఇన్ స్టా వేదికగా నెటిజన్స్ తో పంచుకున్నారు. ఇది తెలిసిన సినీ ప్రముఖులు, నెటిజన్స్, ఫ్యాన్స్ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా రోనిత్ రాయ్, ఆమన భార్య నీలం బోస్‌ రాయ్‌ ల పెళ్లి జరిగి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యను రోనిత్ రాయ్ మరోసారి పెళ్లి చేసుకున్నారు. రోనిత్ రాయ్ తన వ్యక్తి గత ఇన్ స్టా ఖాతాలో తన భార్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇలా రాసుకొచ్చారు. రెండోసారే కాదు.. వెయ్యి సార్లైనా నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ రాసుకొచ్చారు. కాగా 2003లో రోనిత్ రాయ్, నీలం బోస్‌ రాయ్‌ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. మరి బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ తన భార్యను రెండో సారి పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ronit Roy (@ronitboseroy)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş