iDreamPost
iDreamPost
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందు మాధవి నిలిచారు. ఎమోషనల్, వెరీ స్ట్రాంగ్, ఫ్రెండ్లీ అండ్ ఫైర్, ఇలా చాలా అవతారాల్లో కనిపించిన బిందు మాధవి, అఖిల్ సార్ధిక నుంచి గట్టి పోటీ ఎదురైనా, అదే గ్రేస్ తో ట్రోఫీని పట్టుకుపోయారు. అంతేనా! బిగ్ బాగ్ ను గెల్చిన తొలి విమెన్ కంటెస్టెంట్ గా రికార్డు క్రియేట్ చేశారు. రూ.40 లక్షల ప్రైజ్ మనీని గెల్చకున్నారు. అఖిల్ సార్ధిక్ మళ్లీ రన్నర్ అప్ గానే మిగిలిపోయాడు.
బిగ్ బాస్ నాన్ స్టాప్ కి వచ్చినవాళ్లంతా ముదుర్లే. అందుకే గేమ్ చాలా టఫ్. మొదటి నుంచి
బిందు మాధవి ఎగ్రెసీవ్ గేమ్ ను ఎంచుకుంది. అదే దూకుడిని చివరి వరకు కొనసాగించింది. అందుకే ఫస్ట్ ఎపిసోడ్ లోనూ ఆడియన్స్ ఎటెన్షన్ ను సంపాదించుకున్న బిందు మాధవి, మొదట్లో శివ అండ్ కో ఎక్కువగా కనిపించారు. ఇంకో సంగతి, ఆమె మైండ్ గేమ్. తనను నామినేట్ చేసిన వాళ్లకు గట్టిగా సమాధానం ఇచ్చింది. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ట్విస్ట్ తో ఆకట్టుకుంది. కొన్నిసార్లు ఆమె ట్విస్ట్ లకు ఫ్యాన్స్ కూడా అదిరిపోయేవాళ్లు.
నటరాజ్ తో బిందు మాధవి గొడవ ఈ సీజన్ కే హైలెట్. నామినేషన్ సమయంలో కాస్త ఎమోషనల్ అయినా, మిగిలిన సమయంలో మాత్రం సహనం కోల్పోలేదు. గొడవలప్పుడు మాటతూలదు. అందుకే ఆమె యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు బాగా నచ్చింది.
అఖిల్ సార్ధిక్ తో పోలిస్తే బిందు మాధవికి సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ తక్కువ. ఈ మధ్య సినిమాలు చేసింది తక్కువ. తమిళంలో మాత్రం ప్యాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత బిందు మాధవి ఎక్కువగా ఎట్రాక్ట్ చేయడంతో, ఆమె ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ కు లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. వీళ్లంతా యాక్టీవ్ తెగ ఓట్లు వేసేవారు. ఇది ఆమెకు కలసివచ్చింది.
ఫినాలే సందర్భంగా, హోస్ట్ నాగార్జున బిందును ఒక ప్రశ్న అడిగారు. బిగ్ బాస్ కు ఎందుకు వచ్చావు అని అడిగితే, తమిళ బిగ్ బాస్, సినిమాలు అక్కడి ప్రేక్షకులకు దగ్గరచేశాయి. ఇక్కడ కూడా మళ్లీ సినిమాల్లో నటించాలనుకొంటున్నా. అందుకే బిగ్ బాస్ లో పాల్గొన్నానని చెప్పింది.
ఆమె గెల్చిన ట్రోఫీని లేట్ బ్లూమర్స్ కు అంకితమిచ్చింది. చివరకు వరకు పోరాడలని, అప్పుడే సక్సెస్ వస్తుందని చెప్పింది.