iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ హౌస్ లోకి మొగలి రేకులు ఫేమ్ ఇంద్ర నీల్?

  • Published Jul 27, 2024 | 9:30 PM Updated Updated Jul 27, 2024 | 9:30 PM

Bigg Boss Telugu Season 8 Contestants- Indraneel Have Huge Chance: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మొగలి రేకులు సీరియల్, ఇంద్రనీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంద్రనీల్ బిగ్ బాస్ లోకి రాబోతున్నాడు అంటూ గట్టిగానే టాక్ వస్తోంది.

Bigg Boss Telugu Season 8 Contestants- Indraneel Have Huge Chance: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మొగలి రేకులు సీరియల్, ఇంద్రనీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంద్రనీల్ బిగ్ బాస్ లోకి రాబోతున్నాడు అంటూ గట్టిగానే టాక్ వస్తోంది.

  • Published Jul 27, 2024 | 9:30 PMUpdated Jul 27, 2024 | 9:30 PM
బిగ్ బాస్ హౌస్ లోకి మొగలి రేకులు ఫేమ్ ఇంద్ర నీల్?

ఇండియాలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి అధికారిక లోగో వచ్చేసింది. ఇన్ఫినిటీ ఎంటర్ టైన్మెంట్ అంటూ లోగోని లాంఛ్ చేశారు. ఇన్ఫినిటీని 8లా చూపించారు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి చాలానే వార్తలు వస్తూ ఉన్నాయి. వాటిలో షోకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఈసారి చాలా కొత్తగా ఉండబోతోంది అంటున్నారు. సీజన్ 7లోనే ఉల్టా పుల్టా అంటూ చాలానే ప్రయోగాలు చేశారు. ఇప్పుడు అది రెట్టింపు అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ని కూడా చాలా సెలక్టివ్ గా బాగా పాపులారిటీ ఉన్న వాళ్లనే సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవుతుంది అంటున్నారు. ఈ 8వ సీజన్ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నారు. అయితే ఆగస్టు చివరి నాటికి ఈ డేట్ పై క్లారిటీ వస్తుంది. ఈలోపు మేకర్స్ అంతా కంటెస్టెంట్స్ పై దృష్టి సారించారు. ఇప్పటికే చాలానే పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఫలానా వాళ్లు బిగ్ బాస్ కి వస్తున్నారు అంటూ లీకులు వస్తూనే ఉన్నాయి. వాటిలో చాలానే పాపులర్ పేర్లు ఉన్నాయి. ఇప్పటికే సీరియల్ ఆర్టిస్టుల నుంచి లిస్ట్ కూడా రెడీ అయిపోయింది అంటున్నారు. ఆ లిస్ట్ లో నరేశ్ లొల్ల, కుంకుమ పువ్వు ఫేమ్ అక్షిత, కృష్ణ ముకుంద మురారి ఫేమ్ ప్రేరణలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్ కి ఇంకో పేరు యాడ్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా అలాంటి ఇలాంటి పేరు కాదు.. మొగలి రేకులు ఫేమ్ ఇంద్రనీల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో భాగం కాబోతున్నాడు అంటున్నారు. ఈ పేరు మాత్రం చాలా గట్టిగానే వినిపిస్తోంది. అలాగే దాదాపుగా ఇంద్రనీల్ ఎంట్రీ ఖాయమైపోయింది అంటున్నారు. అయితే బిగ్ బాస్ లో ఎవరి పేరును కూడా స్టేజ్ మీదకు వచ్చే వరకు కన్ఫామ్ చేయడానికి ఉండదు. ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక గాసిప్ మాత్రమే అవుతుంది.

అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ కి సంబంధించి లీకులు దాదాపుగా నిజమే అయ్యాయి. కాబట్టి ఇంద్రనీల్ ఎంట్రీ కూడా ఉండచ్చు అని తెలుగు బుల్లితెర ప్రేక్షకులు భావిస్తున్నారు. సీరియల్ ఆర్టిస్టుల్లో ఇంద్రనీల్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇంద్రనీల్ బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెడితే.. మరింత మంది బుల్లితెర ప్రేక్షకులకు షో రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి దాదాపుగా ఇంద్రనీల్ పేరు కన్ఫామ్డ్ లిస్టులో వేసుకోవచ్చు. మరి.. ఇంద్రనీల్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpuan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş