iDreamPost
android-app
ios-app

వికటించిన సర్జరీ.. అందవిహీనంగా మారిన బిగ్ బాస్ బ్యూటీ!

  • Author Soma Sekhar Published - 05:52 PM, Mon - 24 July 23
  • Author Soma Sekhar Published - 05:52 PM, Mon - 24 July 23
వికటించిన సర్జరీ.. అందవిహీనంగా మారిన బిగ్ బాస్ బ్యూటీ!

సాధారణంగా సినిమా హీరోలు, హీరోయిన్ లు వెండితెరపై అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇది అందరు హీరోలకు, హీరోయిన్స్ కు వర్తించదు. కొంతమంది మాత్రమే అందంగా కనిపించాలని సర్జరీల వైపుకు వెళ్తుంటారు. అలాగే సర్జరీ చేయించుకుంది ఓ బిగ్ బాస్ బ్యూటీ. ఆ ఆపరేషన్ కాస్త వికటించడంతో.. అందవిహీనంగా మారానని తాజాగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తన పెదాలు అందంగా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్నానని, కానీ ఆ ఆపరేషన్ కాస్త వికటించడంతో.. తన పరిస్థితి ఎలా తయ్యారైందో ఇన్ స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చింది.

సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఇక తన చిత్ర విచిత్రమైన డ్రస్సింగ్ స్టైల్ తో నిత్యం వార్తల్లో నిలుస్తూ.. వివాదాలతో సావాసం చేస్తుంటుంది. ఈ పాటికే మీకు అర్దం అయ్యింది అనుకుంటా.. నేను చెప్పేది ఎవరి గురించో. అవును పెదాలకు సర్జరీ చేయించుకుని అందవిహీనంగా మారాను అని చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బ్యూటీ, నటి ఉర్ఫీ జావెద్. పెదాలు అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో.. 18 ఏళ్ల వయసు నుంచే వాటికి ఫిల్లర్ సర్జరీ చేయించుకుంటున్నాను అని తెలిపింది. ఇందుకు సంబంధించిన విషయాలను తాజాగా తన సోషల్ మీడియాలో వెల్లడించింది. తన ఆపరేషన్ గురించి చెప్పుకొస్తూ..

“నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే పెదాలకు ఫిల్లర్ సర్జరీ చేయించుకుంటున్నాను. నా పెదాలు అప్పుడు సన్నగా ఉండేవి. వాటిని ఎలాగైనా లావుగా కనపడేలా చేయాలని ఓ వైద్యుడి దగ్గరకు వెళ్ళా. అతడు తక్కువ ఖర్చుతో నా లిప్స్ ను లావుగా తయ్యారు చేస్తా అన్నాడు. దాంతో వైద్యం మెుదలు పెట్టా.. కానీ ఆ ట్రీట్ మెంట్ వికటించి నా పెదాలు ఇక్కడ కింద కనిపిస్తున్న ఫోటోలా తయ్యారు అయ్యాయి. అప్పుడే నాకర్థమైంది. నా ఆపరేషన్ వికటించిందని. ఇక కొన్ని రోజుల తర్వాత ట్రీట్ మెంట్ ను ఆపేయాల్సి వచ్చింది. మీకు ఒక్కటే చెబుతున్నా సర్జరీలు చేయించుకునే ముందు.. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. నేను ఇప్పటికీ లిప్ ఫిల్లర్స్ వాడుతున్నాను” అని తెలిపింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.

కాగా.. మీ శరీరాకృతి బాలేదు, మీ ముఖం బాలేదు అనుకుని సర్జరీకి వెళ్లే ముందు.. ఆ డాక్టర్ గురించి, అతడి ట్రీట్ మెంట్ గురించి తెలుసుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది ఉర్ఫీ. దాంతో ఎప్పుడూ.. డ్రెస్సింగ్ స్టైల్ తో వార్తల్లో నిలిచే ఉర్ఫీ ఇలాంటి సలహాలు కూడా ఇస్తుందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. కాగా.. ఇటీవలే విమానంలో వేధింపులకు గురైంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. మరి తన సర్జరీ ఫెయిల్ అయ్యిందని చెప్పుకొచ్చిన ఉర్ఫీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Uorfi Javed (@urf7i)


ఇదికూడా చదవండి: ఫ్యాన్స్‌ మృతిపై స్పందించిన సూర్య.. వీడియో కాల్‌లో భరోసా!

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş