iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్‌ మృతిపై స్పందించిన సూర్య.. వీడియో కాల్‌లో భరోసా!

ఫ్యాన్స్‌ మృతిపై స్పందించిన సూర్య.. వీడియో కాల్‌లో భరోసా!

హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరు ఫ్యాన్స్‌ మరణించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం మోపువారిపాలెం గ్రామానికి చెందిన నక్క వెంకటేష్, పోలూరు సాయి సూర్య బర్త్‌డే ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదానికి గురయ్యారు. కరెంట్‌ షాక్‌ తగలటంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. దీంతో ఇద్దరి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషాద ఘటనపై హీరో సూర్య స్పందించారు. బాధిత కుటుంబాలతో వీడియో ​కాల్‌లో మాట్లాడిన ఆయన వారికి భరోసా ఇచ్చారు.

బుధవారం హీరో సూర్య.. మృతి చెందిన ఫ్యాన్స్‌ వెంకటేష్‌, సాయి తల్లిదండ్రులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. ఆ ఇద్దరి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ఇద్దరి కుటుంబాలను అన్ని విధాలా తాను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ వీడియోను నెల్లూరు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అఫిషియల్‌ ట్విటర్‌ ఖాతాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న హీరో ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సూర్య మంచి తనంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

కాగా, హీరో సూర్య ప్రముఖ తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే ప్యాన్‌ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో సూర్య నటన అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. సూర్య ఖాతాలో మరో సూపర్‌ హిట్‌ ఖాయం అని సగటు సినీ ప్రేక్షకుడు భావిస్తున్నాడు. ఇక, సూర్య.. వెట్రిమారన్‌ డైరెక్షన్‌లో ‘వాడివాసల్‌’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, హీరో సూర్య చనిపోయిన ఫ్యాన్స్‌ కుటుంబానికి అండగా నిలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/