iDreamPost
android-app
ios-app

సుమ గొప్ప మనస్సు! డబ్బులు లేవంటే..ఫ్రీగానే ఈవెంట్ చేస్తానని..

  • Published Jan 29, 2024 | 1:14 PM Updated Updated Jan 29, 2024 | 1:14 PM

Suma Kanakala: యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మాటలతో, పంచులతో బుల్లితెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే తాజాగా ఆమె గురించి ఓ విషయం చెబుతూ హీరో సోహెల్ ఎమోషనలయ్యాడు.

Suma Kanakala: యాంకర్ సుమా కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మాటలతో, పంచులతో బుల్లితెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే తాజాగా ఆమె గురించి ఓ విషయం చెబుతూ హీరో సోహెల్ ఎమోషనలయ్యాడు.

  • Published Jan 29, 2024 | 1:14 PMUpdated Jan 29, 2024 | 1:14 PM
సుమ గొప్ప మనస్సు! డబ్బులు లేవంటే..ఫ్రీగానే ఈవెంట్ చేస్తానని..

సినీ ఇండస్ట్రీలో చాలా మందికి యువ నటులు గొప్ప స్టార్ హోదాను సంపాదిస్తుంటారు. అంతేకాక మరెందరో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాలని తహతహలాడుతుంటారు. ఇలా కొత్త వచ్చే నటీనటులకు..ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్లు సహయం చేస్తుంటారు. కొందరు స్టార్లు కొన్ని సార్లు చిన్న సినిమాలకు, అప్పుడప్పుడే వస్తున్న స్టార్ హీరోలకు ఏమి ఆశించకుండా సహాయం చేస్తారు.  సినిమాకి సంబంధించిన ఈ వెంట్స్ కి వెళ్లి అప్పుడే ఎదుగుతున్న నటులకు సపోర్టు చేస్తారు. తాజాగా యాంకర్ సుమ కూడా అలాంటి  ఓ మంచిపని చేసి.. తన గొప్ప మనస్సు చాటుకుంది.

యాంకర్ సుమ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన హాస్యం, పంచులతో ఆడియన్స్ ను ఇట్టే కట్టిపడేస్తారు. ఇక తెలుగు బుల్లితెర ప్రపంచంలో ఆమె ఎన్నో ఏళ్ల  నుంచి రారాణిలాగా వెలుగొందుతున్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ఇప్పటికీ కూడా సుమ పలు టీవీ షోలు, సినిమా ఈవెంట్స్  తో స్టార్ హీరోయిన్ల రేంజ్ లో బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా సినిమా ఈ వెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే.  అలానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి యాంకర్ సుమ బాగానే రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

Anchor Suma is a good mind!

ఇలా ఎంతో బిజీగా ఉండే.. ఆమె యాంకర్ గా, నటిగా దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ మన ఇంట్లో ఆడపడుచు అయిపోయింది. ఇప్పటికి సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా ఉంటుంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కచ్చితంగా సుమ ఉండాల్సిందే. అయితే యాంకర్ గా సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బాగానే ఛార్జ్ చేస్తుంది. కానీ ఇటీవల ఓ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్రీగా చేస్తానని మాట ఇచ్చింది. అయితే ఆమె తరచూ తన మంచి మనస్సును చాటుకుంటారు. ఇటీవల ఓ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫ్రీగా చేస్తానని మాట ఇచ్చింది. మరి.. ఆ హీరో ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు పొందిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది వివిధ షోలతో, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలా బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో సోహెల్ ఒకరు. అతడు ఇప్పుడు హీరోగా వరుసగ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ‘మిస్టర్ ప్రగ్నెంట్’ అనే  సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. అలానే ఆ సినిమాలో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేశాడు. ఇక తర్వలో ‘బూట్ కట్ బాలరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు సోహెల్ రానున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో సోహెల్ తో పాటు మూవీ టీమ్  సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.  ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్, ఆ సినిమా హీరోయిన్ సుమ అడ్డా షోకి వెళ్లారు.  ఈ సందర్భగా షోలో  సోహెల్ యాంకర్ సుమ గురించి చెప్తూ ఎమెషనల్ అయ్యాడు.

సోహెల్ సుమ అడ్డా షోలో పాల్గొన్ని తెగ సందడి చేశాడు. హీరోయిన్, సుమాతో కలిసి సోహెల్ కామెడీని పండించాడు. ఇక ఈ షోలోనే సోహెల్ మాట్లాడుతూ.. ఈమధ్యనే సుమ అక్క మేనేజర్ కి కాల్ చేశానని, తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కొంచెం తగ్గించండి అని అడిగాని సోహెల్ తెలిపాడు.  సరే అక్కతో మాట్లాడి చెప్తానని  మేనేజర్ తెలిపారని సోహెల్ అన్నాడు. తర్వాత సుమ అక్క వద్ద నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేశానని, తాను అమౌంట్ తక్కువ ఇద్దామనుకుంటున్నాని తెలిపాడు. తానే ప్రొడ్యూసర్, అంత డబ్బులు లేవు, చాలా కష్టపడుతున్నానని చెప్పినట్లు తెలిపాడు.

“నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను, నా కొడుకు సినిమా కూడా చేశాను.. ఆ బాధ నాకు తెలుసని సుమ చెప్పిందంట. లైఫ్ లో ఇంత ఎదిగింది ఎందుకు, మీలాంటి వాళ్లకి మద్దతుగా చేయడానికే అని తనకు ఫ్రీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తాను సుమ అక్క చెప్పారు. థ్యాంక్యూ అక్క నేనెప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను” అంటూ  సోహెల్ ఎమోషనల్ అయ్యాడు సోహెల్. ఫిబ్రవరి 2న విడుదల కానున్న బూట్‌కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. మరి.. సుమ గురించి సోహెల్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by mitai sastri (@mitai_sastri)

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş