iDreamPost
android-app
ios-app

వీడియో: లైవ్ లో అమ్మాయికి జెస్సీ ప్రపోజ్! అమ్మాయి ఎవరంటే?

  • Published Mar 04, 2024 | 4:46 PM Updated Updated Mar 04, 2024 | 4:46 PM

Jeswanth Jessie Proposed A Girl: మోడల్ జెస్సీ ప్రస్తుతం నటుడిగా, ఇన్ ఫ్లుఎన్సర్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా ఓ అమ్మాయికి లైవ్ లో ప్రపోజ్ చేసి అందరినీ షాక్ కు గురి చేశాడు.

Jeswanth Jessie Proposed A Girl: మోడల్ జెస్సీ ప్రస్తుతం నటుడిగా, ఇన్ ఫ్లుఎన్సర్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా ఓ అమ్మాయికి లైవ్ లో ప్రపోజ్ చేసి అందరినీ షాక్ కు గురి చేశాడు.

  • Published Mar 04, 2024 | 4:46 PMUpdated Mar 04, 2024 | 4:46 PM
వీడియో: లైవ్ లో అమ్మాయికి జెస్సీ ప్రపోజ్! అమ్మాయి ఎవరంటే?

జశ్వంత్ జెస్సీ.. ఈ కుర్రాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి చేరుకున్నాడు. చిన్న ప్రైవేట్ ఉద్యోగంతో జీవితం మొదలు పెట్టి ఇప్పుడు ఒక మోడల్ గా, నటుడిగా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా కొనసాగుతున్నాడు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో గిన్నిస్ బుక్ రికార్డును కూడా పొందాడు అని అందరికీ తెలిసిందే. అలాగే ఢీ సెలబ్రిటీ స్పెషల్ షోతో తనలో ఉన్న డాన్సర్ ని కూడా ఆడియన్స్ కి పరిచయం చేశాడు. బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. వారి మనిషిగా మారిపోయాడు. ఇప్పుడు తాను మెచ్చిన అమ్మాయిని పరిచయం చేశాడు.

జెశ్వంత్ జెస్సీ నిజానికి ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలి. లైఫ్ లో ఎక్కడి నుంచో మొదలై ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారిపోయాడు. కష్టాలకు భయపడితే అనుకున్నది సాధించలేం అని నిరూపించాడు. జెస్సీ అటు మోడల్ గానే కాకుండా ఇటు యాక్టర్ గా, బుల్లితెర షోస్ లో స్పెషల్ ఎంట్రీ ఇస్తూ తనదైనశైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా జెస్సీ తన ప్రియురాలిని పరిచయం చేశాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ తాజాగా ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ప్రోమో విడుదల చేసింది. ఆ ప్రోమోలో జెస్సీ కూడా ఎంట్రీ ఇచ్చాడు. తాను రావడమే తన ప్రియురాలితో స్టేజ్ మీదకు వచ్చాడు.

స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత అందరి ముందు ఆమెకు రెడ్ రోజ్ మాత్రమే కాకుండా తాజ్ మహల్ కూడా గిఫ్ట్ చేసి ప్రపోజ్ చేశాడు. కచ్చితంగా నిన్ను బాగా చూసుకుంటాను.. అది మాత్రం చెప్పగలను అంటూ జెస్సీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం చెప్పడానికి లేదు. బుల్లితెర ప్రోమోల్లో మనం ఇప్పటికే చాలాసార్లు పెళ్లిళ్లు చూశాం.. ప్రపోజ్ చేసుకోవడం చూశాం.. షోస్ కోసం జంటలుగా మారడం చూశాం. కాబట్టి దీనిలో ఎంత నిజం ఉంది అని మాత్రం చెప్పడానికి లేదు. మరి.. లైవ్ లో జెస్సీ అమ్మాయికి ప్రపోజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş