iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ తెచ్చిన తంటా.. విడాకులు ఇస్తానంటున్న యూట్యూబర్ పెద్ద భార్య!

  • Published Jul 21, 2024 | 4:11 PM Updated Updated Jul 21, 2024 | 4:11 PM

Bigg Boss Fame Armaan Malik Wife Payal Wants Divorce: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3లో ప్రముఖ యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే పెద్ద భార్య హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తన భర్త నుంచి విడిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

Bigg Boss Fame Armaan Malik Wife Payal Wants Divorce: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3లో ప్రముఖ యూట్యూబర్ తన ఇద్దరు భార్యలతో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే పెద్ద భార్య హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తన భర్త నుంచి విడిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

  • Published Jul 21, 2024 | 4:11 PMUpdated Jul 21, 2024 | 4:11 PM
బిగ్ బాస్ తెచ్చిన తంటా.. విడాకులు ఇస్తానంటున్న యూట్యూబర్ పెద్ద భార్య!

భాష ఏదైనా కూడా బిగ్ బాస్ షోకి మాత్రం అమితమైన రీచ్ ఉంటోంది. ముఖ్యంగా హిదీలో అయితే బిగ్ బాస్ కు నెక్ట్స్ లెవల్ రెస్పాన్స్, ఆదరణ ఉంది. ఇప్పుడు హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తోంది. ఈ షోలోకి సామాన్యంగా కాంట్రవర్సీ ఉన్న వాళ్లు.. కాంట్రవర్సి క్రియేట్ చేయగలిగిన వాళ్లనే తీసుకుంటారు. ఇప్పుడు చెప్పుకోవబోయే కపుల్స్ వల్ల ఆల్రెడీ కాంట్రవర్సి క్రియేట్ అయ్యింది. ఇప్పుడు బయట ఇంకో షాకింగ్ కామెంట్స్ తో అసలు రచ్చ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సీజన్ లో ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో కలిసి పాల్గొన్నాడు. అయితే ఇటీవల పెద్ద భార్య పాయల్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆమె కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ షో నుంచి యూట్యూబర్ అర్మాన్ మాలిక్ భార్య పాయల్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆమెను ఒకవారం గెస్ట్ గా హౌస్ లోకి తీసుకెళ్లారు. అప్పుడు లోపలికి వెళ్లి ఒక రచ్చ చేసి వచ్చింది. ఒక కంటెంస్టెంట్ తన సోదరి కృతిక గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అర్మాన్ వెళ్లి ఆ విషయం గురించి అతడిని అడగడమే కాకుండా.. చేయి కూడా చేసుకున్నాడు. అతను కృతిక ఒదిన బాగుంటుంది అంటూ కామెంట్స్ చేశాడు. దానికి కోపంతో ఊగిపోయిన అర్మాన్ చేయి చేసుకున్నాడు. ఆ గొడవ సమసిపోయింది. ఇప్పుడు బయట ఉన్న పాయల్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్తకు విడాకులు ఇచ్చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక వ్లాగ్ చేసిన పెద్ద భార్య పాయల్ తాను అర్మాన్ మాలిక్ కు విడాకులు ఇచ్చే అంశం గురించి ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ షో తర్వాత తమ మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంట. అంతేకాకుండా.. కృతిక- తాను లెస్బియన్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారంట. అలాగే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండటం కూడా అంత మంచి విషయంగా ఎవరూ భావించడం లేదు అనే అభిప్రాయాన్ని తన మాటల్లో వ్యక్త పరిచింది.

అందుకే తాను విడాకుల గురించి ఆలోచన చేస్తున్న విషయాన్ని వెల్లడించింది. అర్మాన్- కృతిక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఈ విషయమై చర్చిస్తానని చెప్పింది. అయితే ఇక్కడ ఇవి నిజంగానే చేసిన కామెంట్సా? లేక రీచ్, వైరల్ కావడం కోసం, తన భర్త- సోదరికి బిగ్ బాస్ హౌస్ లో రీచ్ పెంచడం కోసం చేసిన వ్యాఖ్యలా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిజంగానే వచ్చిన తర్వాత విడాకులు తీసుకుంటే.. బిగ్ బాస్ ఖాతాలో మరో జంటను విడకొట్టిన క్రెడిట్ పడుతుంది. మరి పాయల్ తన భర్తకు విడాకులు ఇస్తాను అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş