iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి అంతకుమించి! వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్!

  • Author ajaykrishna Published - 08:38 AM, Tue - 11 July 23
  • Author ajaykrishna Published - 08:38 AM, Tue - 11 July 23
బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి అంతకుమించి! వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో అప్డేట్ వచ్చేసింది. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించి క్రేజీ ప్రోమో రిలీజ్ అయ్యింది. 6వ సీజన్ ముగిసి చాలా కాలం అయ్యేసరికి అసలు 7వ సీజన్ ఉంటుందా లేదా అనే సందేహాలు జనాలలో మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో నేరుగా సీజన్ 7కి సంబంధించి ప్రోమో తోనే అనౌన్స్ చేశారు నిర్వాహకులు. ఎలాంటి హడావిడి లేకుండా.. సింపుల్ వీడియోలో కొత్తగా డిజైన్ చేసిన బిగ్ బాస్ లోగో ఆకట్టుకుంటుంది. మరి షో ఎప్పుడు మొదలవుతుంది? అనంటే.. సెప్టెంబర్ 2 ఆదివారం నుండి బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం కాబోతుంది. కానీ.. ఇంకా టైమ్ ఉండగానే ప్రోమో వదలడం ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ కలిగిస్తుంది.

ఇక ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 సెట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి.. ఈసారి కొత్త సీజన్ ప్రకటించిన దానికంటే కాస్త ముందే మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే.. ఈ 7వ సీజన్ కి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇక ఇప్పటికైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోయే కంటెస్టెంట్స్ ఎవరినేది? క్లారిటీ రాలేదు. కానీ.. సోషల్ మీడియాలో కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో l ఢీ పండు, సిద్దార్ధ వర్మ, అమర్ దీప్ చౌదరి, ఈటీవీ ప్రభాకర్, సాయి రోనక్, సింగర్ మోహన భోగరాజు, కార్తీకదీపం శోభాశెట్టి, మొగలిరేకులు సాగర్.. ఇలా పేర్లు వైరల్ అవుతున్నాయి.

వీరిలో ఫైనల్ గా ఎవరు ఉంటారు.. అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక గతేడాది బిగ్ బాస్ సీజన్ 6 అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఇప్పుడు సీజన్ 7 ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి సీజన్ 6 తర్వాత ఓటీటీ సీజన్ 2 ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. సీజన్ 6 ఎఫెక్ట్‌ తో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటిటి సీజన్ ఫెయిల్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ సీజన్ 6పై కూడా పడింది. అందువల్ల కనీసం బిగ్ బాస్ 6 కి రేటింగ్ ఎంత వచ్చిందో కూడా చెప్పలేకపోయారు నిర్వాహకులు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈసారి సీజన్ 7కి పగడ్బందీ ఏర్పాట్లు చేశారట. కంటెస్టెంట్స్‌ కూడా ఈసారి యూట్యూబ్, సోషల్ మీడియా నుండే కాకుండా.. కాస్త పేరున్న సెలబ్రిటీలను రంగంలోకి దించబోతున్నారని వినికిడి. చూడాలి ఈసారి ఎలా ఉంటుందో.. మరి బిగ్ బాస్ 7 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by STAR MAA (@starmaa)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingTimebetGrandpashabetGrandpashabetcasibombetpark girişpiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomjojobetgrandpashabetcasibomgrandpashabet girişbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabet