iDreamPost
android-app
ios-app

టెన్షన్ పెంచేసిన బిగ్ బాస్.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఇద్దరా?

  • Author ajaykrishna Updated - 09:18 PM, Sun - 8 October 23
  • Author ajaykrishna Updated - 09:18 PM, Sun - 8 October 23
టెన్షన్ పెంచేసిన బిగ్ బాస్.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఇద్దరా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. 7వ సీజన్ ఆరంభం నుండే ఆసక్తికరంగా మారింది. ఉల్టా పుల్టా అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ కొత్త సీజన్.. ఒక్కో ఎలిమినేషన్ ఎపిసోడ్ కి ఫ్యాన్స్ లో టెన్షన్ తో పాటు ఆసక్తి కూడా పెంచేస్తుంది. ఇప్పటికి నాలుగు వారాలలో నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. ఉన్న పదిమందిలో ఈరోజు మరొకరు బయటికి రానున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్స్ చాలా జోరుగా సాగుతున్నాయి. ఒక్కొక్కరుగా అసలు ఆటను అర్ధం చేసుకోవడం మొదలు పెడుతున్నారు. మొదట్లో కలిసి ఆడుదాం అనుకున్న వారంతా రాను రాను ఎవరి స్ట్రెటజీ వారు తెలుసుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా లేటెస్ట్ నామినేషన్స్ నిలిచాయి.

తాజాగా విడుదలైన ప్రోమో.. ఈ వారం ఎలిమినేషన్స్ పై ఆద్యంతం ఆసక్తి పెంచేసింది. ఏకంగా ఏడుగురు నామినేషన్స్ లో నిలిచారు. వారిలో శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్‌ దీప్, గౌతమ్, టేస్జీ తేజ, ప్రియాంక జైన్, శుభశ్రీ రాయగురు ఉన్నారు. అయితే.. ఈ వారం ఎలిమినేషన్స్ ప్రాసెస్ ని ఉల్టా పుల్టా చేశారు బిగ్ బాస్. ఎలిమినేషన్ తో ఎపిసోడ్ ని ప్రారంభిద్దాం అని ట్విస్ట్ ఇవ్వడంతో ప్రోమో మొదలైంది. ప్రోమో చూస్తుంటే.. ఎలిమినేట్ అయ్యేది ఒక్కరు కాదు.. ఇద్దరేమో అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. గత వారాలలో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక బయటికి పోయారు.

ఈరోజు ఎపిసోడ్ లో.. ఎలిమినేట్ అయ్యేది ఇద్దరా.. అనే విషయంపై అందరిలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఈ వారం పవర్ అస్త్ర గెలుచుకున్న శోభా శెట్టి, సందీప్, ప్రశాంత్ తప్ప మిగతా అందరు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే.. ఓటింగ్స్ ప్రకారం.. శివాజీ టాప్ లో ఉండగా.. శనివారం ఓటింగ్స్ బట్టి ఏం జరిగింది? అనేది ఎపిసోడ్ లో తెలియనుంది. ఇదిలా ఉండగా.. ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ లో టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ కోసం మాస్ రాజా రవితేజ, చిన్నా ప్రమోషన్స్ కోసం సిద్ధార్థ షోలో సందడి చేయనున్నారు. ఆదివారం ఎలిమినేషన్ టెన్షన్ తో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా లభించనుంది. మరి ఈ వారం నామినేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş