iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబో మూవీలో బిగ్ ట్విస్ట్!

  • Published Feb 14, 2024 | 7:14 PM Updated Updated Feb 14, 2024 | 7:14 PM

Ram Charan- Buchi Babu RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఆర్సీ16పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బిగ్ ట్విస్ట్ వచ్చింది.

Ram Charan- Buchi Babu RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఆర్సీ16పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బిగ్ ట్విస్ట్ వచ్చింది.

  • Published Feb 14, 2024 | 7:14 PMUpdated Feb 14, 2024 | 7:14 PM
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబో మూవీలో బిగ్ ట్విస్ట్!

RRR తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ లైనప్ గురించి ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే చెర్రీ.. తన 15వ ప్రాజెక్టుగా శంకర్ దర్శత్వంలో “గేమ్ ఛేంజర్” గ్లోబల్ ఆడియన్సే టార్గెట్ గా సిద్ధమయ్యాడు. శంకర్ ప్రాజెక్ట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అంతే డిలే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఆ గ్యాప్ ని బుచ్చిబాబు- RC16 అప్డేట్లతో ఎంజాయ్ చేయొచ్చని చెర్రీ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా ఆ మూవీ కాస్టింగ్, కథ గురించి కూడా తీవ్ర ఊహాగానాలు నడుస్తున్నాయి. అలాంటి వార్తలను ఒక మీడియా సంస్థ ఖండించింది. తమకు సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాలను వెల్లడించింది.

ఈ సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు అప్పట్లో ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో అభిమానులు ఇది మరో ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మల్ల యోధుడు ‘కోడి రామ్మూర్తి’ జీవితం ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం రూపొందిస్తునట్లు ఓ రూమర్ స్ట్రాంగ్ గా వైరల్ అయింది. ఈ రూమర్లకు అఫీషియల్ గా చెక్ పెడుతూ ఓ మీడియా సంస్థ ప్రకటన చేసింది. ఆ రూమర్లు అన్నీ అవాస్తవం అంటూ తెలుపుతూ చెర్రీ- బుచ్చిబాబు మూవీ స్టోరీ లైన్ ని కూడా రివీల్ చేశారు. RC16 పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లోనే స్పోర్ట్స్- డ్రామాగా తెరకెక్కనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారని తెలిపింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు.

సోషల్ మీడియాలో నిన్నటి వరకు ఇది కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వస్తునట్లు ఊహాగానాలు ఉండగా సడెన్ గా నేటి నుండి క్రికెట్ బ్యాక్ డ్రాప్ మూవీ అని ట్రెండ్ అవుతోంది. కాగా.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ అనగానే చాలామంది అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. పీరియాడిక్ సినిమా అయితే మరో ‘లగాన్’ కాబోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి.. భారీ తారాగణంతో వస్తున్న శంకర్ ‘గేమ్ చేంజర్’ తో పాటు RC16 పైనా అంతే ఆశలు పెట్టుకున్నారు చెర్రీ ఫ్యాన్స్. చరణ్- గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ షెల్వ్ అయినా మెగా భిమానులు ఏ మాత్రం నిరాశ చెందకుండా గేమ్ ఛేంజర్, RC16 అప్డేట్లతో మరింత ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ లైనప్, రూమర్స్, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet