iDreamPost
android-app
ios-app

శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్‌ చెప్పు వదిలేయటంపై అమితాబ్‌ కామెంట్లు!

  • Published Nov 09, 2023 | 9:01 AM Updated Updated Nov 09, 2023 | 9:01 AM

పుష్ప సినిమాలో శ్రీ వల్లి పాట దేశ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయింది. ఈ పాటలో అల్లు అర్జున్‌ చెప్పు వదిలేసి మళ్లీ వేసుకోవటం ఓ ట్రెండ్‌ను సెట్‌ చేసింది. ఇక, ఈ స్టెప్పుపై తాజాగా బిగ్‌బీ స్పందించారు.

పుష్ప సినిమాలో శ్రీ వల్లి పాట దేశ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయింది. ఈ పాటలో అల్లు అర్జున్‌ చెప్పు వదిలేసి మళ్లీ వేసుకోవటం ఓ ట్రెండ్‌ను సెట్‌ చేసింది. ఇక, ఈ స్టెప్పుపై తాజాగా బిగ్‌బీ స్పందించారు.

  • Published Nov 09, 2023 | 9:01 AMUpdated Nov 09, 2023 | 9:01 AM
శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్‌ చెప్పు వదిలేయటంపై అమితాబ్‌ కామెంట్లు!

దేశ వ్యాప్తంగా ‘పుష్ప’ సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌ సినిమా అయినా.. నార్త్‌లో ఓ రేంజ్‌ హిట్‌ను అందుకుంది. ఉత్తర భారతదేశ ప్రజలు ఓ తెలుగు సినిమాను తమ సినిమాగా ఓన్‌ చేసున్నారు. ముఖ్యంగా సినిమాలోని పాటలు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ హిట్‌ అయ్యాయి. శ్రీ వల్లీ, ఊ అంటావా? పాటలు జనాల్లోకి బాగా ఎక్కేశాయి. మధ్య తరగతి కుటుంబాల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాల దగ్గరినుంచి.. బిలియనీర్ల ఇళ్లలో జరిగే వేడుకల్లో కూడా ఈ పాటలు మోత మోగించాయి. ఇక, పుష్ప సినిమాలోని శ్రీ వల్లి పాటపై తాజాగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు.

చెప్పు సీన్‌పై పలు కామెంట్లు చేశారు. బిగ్‌బీ అమితాబ్‌ గత కొన్నేళ్లుగా కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ’ ప్రోగ్రామ్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతతం సీజన్‌ 15 కొనసాగుతోంది. తాజాగా, ఈ కార్యక్రమంలో బిగ్‌బీ అమితాబ్‌కు పుష్ప సినిమాపై ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు బిగ్‌బీ సమాధానం ఇస్తూ.. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా నిజంగా ఓ అద్భుతమైన సినిమా అని అన్నారు. ఆ సినిమాలోని శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించిందని అన్నారు. చెప్పు వదిలేసినా వైరల్‌ కావటం తన జీవితంలో మొదటి సారి చూస్తున్నానని అన్నారు. ఆ పాటకు దేశ వ్యాప్తంగా చాలా మంది డ్యాన్సులు చేశారని తెలిపారు.

ప్రతీ ఒక్కరు చెప్పువదిలేసి మళ్లీ వదిలేశారని అన్నారు. శ్రీవల్లి పాటపై ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌ స్పందించటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ కామెంట్లు మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, పుష్ప సినిమాలో నటనకు గానూ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. మొదటి భాగం సాధించిన విజయంతో చిత్ర దర్శకుడు సుకుమార్‌ రెండో భాగంగా ఎక్కువ శ్రద్ధ పెట్టాడు.

మొదటి భాగానికి మించి పదిరెట్లు ఉండేలా పుష్ప : ది రూలింగ్‌ను తీర్చి దిద్దుతున్నారు. తారాగణం విషయంలోనూ ప్రత్యేక దృష్టి పెట్టారు. స్టార్‌ క్యాస్టింగ్‌ను సినిమాలో భాగం చేశారు. తమిళ స్టార్‌ హీరో, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇక, త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగరాయనుందో వేచి చూడాల్సిందే. మరి, పుష్ప సినిమాలోని శ్రీ వల్లి పాటలో అల్లు అర్జున్‌ చెప్పు వదిలేయటంపై బిగ్‌ బీ స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş