iDreamPost
android-app
ios-app

గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్లో.. ఈ విషయాలు గమనించారా?

  • Published Feb 10, 2024 | 8:09 PM Updated Updated Feb 10, 2024 | 8:09 PM

Bhootaddam Bhaskar Narayana: టాలీవుడ్ లో ఎప్పుడూ సరికొత్త కథలు వస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

Bhootaddam Bhaskar Narayana: టాలీవుడ్ లో ఎప్పుడూ సరికొత్త కథలు వస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

  • Published Feb 10, 2024 | 8:09 PMUpdated Feb 10, 2024 | 8:09 PM
గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్లో.. ఈ విషయాలు గమనించారా?

ఇండస్ట్రీలో ఏ సినిమా చిన్నది కాదు.. ఏ సినిమా పెద్దది కాదు. ఏ మూవీ ఆడిన్స్ కి నచ్చుతుందో, ఏ సినిమా హిట్టు కొడుతుందో.. ఈ చిత్రం బయ్యర్లను లాభాలతో సంతోష పెడుతుందో అదే పెద్ద సినిమా. టాలీవుడ్ లో చిన్న సినిమాలుగా ఏంట్రీ ఇచ్చి అతి భారీ హిట్లు కొట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి కోవలోకి ఇప్పుడు మరో కొత్త సినిమా వచ్చి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మూవీ మరేదో కాదు.. భూతద్దం భాస్కర్ నారాయణ. తాజాగా ఆ మూవీకి సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది.

శివ కందుకూరి హీరోగా వస్తున్న చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ మూవీకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. శశిధర్, స్నేహాల్, కార్తీక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ మూవీ పోస్టర్స్ దగ్గరి నుంచి ట్రైలర్ కట్ వరకు మంచి ఫ్రెష్ ఫీల్ వచ్చింది అంటున్నారు. ఈ మూవీ ట్రైలర్ లో గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ మూవీ పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది అనే విషయం అర్థమైపోతోంది.

ట్రైలర్ లో కొంత కథ కూడా చెప్పారు. గుర్తు తెలియని శవాలు దొరుకుతున్నాయి. ఎవరో ఒక సీరియల్ కిల్లర్ 18 ఏళ్లలో 16 హత్యలు చేశాడు. అది ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. అలాంటి ఒక ఛాలెంజింగ్ కేసును డిటెక్టివ్ గా చెప్పుకుంటూ తిరిగే భూతద్దం భాస్కర్ నారాయణ ఛేదించాలి. దీనికి పురాణాలు, ఇతిహాసాల టచ్ ఇస్తూ.. ఇవన్నీ దిష్టిబొమ్మ హత్యలు కాదు నరబలి అంటూ హీరోతో చెప్పించారు. అప్పటికే సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ అంటున్న మాట.. ఈ మూవీ చూస్తుంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ గుర్తొస్తోంది అని. నిజానికి ఆ మాట కూడా వాస్తవమనే చెప్పాలి.

ఈ మూవీలో హీరో యాక్టింగ్, స్టోరీ చెప్తున్న విధానం, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ కాస్త కొత్తగా ఉన్నాయి అనే భావన కలుగుతోంది. ఒక సినిమాని చూస్తే మరో మూవీ తాలుకూ విషయాలు గుర్తుకురావడం సహజమే. ట్రైలర్ లో చూపించిన సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కానీ, దీనికంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేయగలిగితే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్టు కొడుతుంది. అదే బాటలో ఈ భూతద్దం భాస్కర్ నారయణ సినిమా వెళ్తుందని ఆడియన్స్ కూడా నమ్ముతున్నారు. అందరూ ఈ ట్రైలర్ చూసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ వచ్చింది అంటున్నారు. ఈ మూవీలో జరుగుతున్న హత్యలు చేస్తోంది ఎవరు? అవి నిజంగానే నరబలి కోసం చేస్తున్నారా? డిటెక్టివ్ అని చెప్పుకుంటూ తిరిగే భూతద్దం భాస్కర్ ఆ కేసును ఛేదిస్తాడా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే మార్చి 1 వరకు ఆగాల్సిందే. మరి.. భూతద్దం భాస్కర్ నారాయణ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş