భారతీయుడు 2 టికెట్ రేట్లు పెంపు! ఎక్కడెక్కడ ఎంతంటే?

Bharateeyudu 2 Movie Tickets Rate Hike: భారతీయుడు 2 కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరక్కిన ఈ మూవీ జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఈ క్రమంలో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Bharateeyudu 2 Movie Tickets Rate Hike: భారతీయుడు 2 కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరక్కిన ఈ మూవీ జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఈ క్రమంలో టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

‘భారతీయుడు’.. 1996లో విశ్వ నటుడు కమల్ హాసన్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అవినీతిని అంతం చేయాలని కంకణం కట్టుకున్న ఓ మాజీ సైనికుడి కథే ఈ సినిమా. అప్పట్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా.. అదే రేంజ్ లో వసూళ్లను సృష్టించి సంచలనం రేపింది. ఈ మూవీకి దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ ను తీసుకొచ్చారు. భారతీయుడు 2 పేరుతో వస్తున్న ఈ చిత్రంలో కమల్ ఓ రేంజ్ లో ఫైట్స్ చేశాడు. డైరెక్టర్ శంకర్ సైతం ప్రస్తుత సమాజానికి తగ్గట్లుగా ఈ మూవీని తెరకెక్కించాడు. వరల్డ్ వైడ్ గా జూలై 12న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ టీమ్ కు టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఎంత పెంచారంటే?

కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ తో మూవీపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచేశాడు డైరెక్టర్ శంకర్. 103లో వయసులో కూడా సేనాపతి విన్యాసాలు చేయడం సినిమాకు హైలెట్ గా నిలవనుంది. ఇక ఈ చిత్రం జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లను పెంచుకునేందుకు మేకర్స్ కు  వెసులుబాటు కల్పించింది. మల్టీప్లెక్స్ ల్లో రూ. 75 +GST, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50+GST పెంచుకునే అవకాశం కల్పించింది. 5th షోకు కూడా అవకాశం లభించింది. అయితే ఏపీలో టికెట్ల రేట్ల పెంపుపై సమాచారం లేదు.

ఇక ఈ మూవీని తెలంగాణలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. కాగా.. టికెట్ల రేట్లను పెంచుకోవాలనుకుంటే.. యాంటి డ్రగ్ క్యాంపెయిన్ వీడియోలు హీరో, హీరోయిన్లతో చేపించాలని కండీషన్ పెట్టారు. అందులో భాగంగా భారతీయుడు 2 యూనిట్ ఈ విధంగా చేసింది. కమల్ హాసన్, సిద్దార్థ్, సముద్ర ఖని సహా ఇతర నటీ, నటులు డ్రగ్స్ వాడకూడదు అంటూ వీడియోలు రిలీజ్ చేశారు. అనంతరం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని మూవీ టీమ్ కోరగా.. రూ. 75 మాక్సిమం, రూ. 50 మినిమం పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మరి టికెట్ల రేట్ల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments