Arjun Suravaram
Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది. ఈ కేసుకు సంబంధించి.. ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా మరో అదిరిపోయే ట్విస్ట్ బయటపడింది.
Darshan Case: కన్నడ హీరో దర్శన్ కేసు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది. ఈ కేసుకు సంబంధించి.. ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా మరో అదిరిపోయే ట్విస్ట్ బయటపడింది.
Arjun Suravaram
ప్రియురాలికి అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపాడన్న ఆరోపణలపై కన్నడ స్టార్ హీరో దర్శన్..తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేయించిన సంగతి విదితమే. ఈ ఘటన కన్నడ ఇండస్ట్రీతో పాటు సౌత్ లోని ఇతర సినీ ఇండస్ట్రీలో సంచలనగామారింది. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది అరెస్టు అయ్యారు. దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడతో మరికొందరు జైల్లో ఉన్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించి పలు అంశాలపై కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ.. కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే దర్శన్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగుకి రాగా..తాజాగా మరో సూపర్ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి.
రేణుకాస్వామి హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక ఆధారాలను సంపాదించారు. నిందితులను విచారించగా అనేక ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే దర్శన్ పలుమార్లు బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు తిరష్కరించింది. అంతేకాక ఆయన చేసిన పలు వినతులను కోర్టు కొట్టేసింది. ఇలా దర్శన్ కి కోర్టులో చుక్కెదురు అవుతుంది. తాజాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ , పవిత్రగౌడ టీమ్ కి ఉచ్చు మిరంత బిగుస్తోంది. హత్య జరిగిన సమయంలో జూన్8,9,10 తేదీల్లో దర్శన్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన పుటేజ్ ను డిలీట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో సీసీ పుటేజ్ కి సంబంధించిన డీవీఆర్ లను తీసుకెళ్లిన పోలీసులు దృశ్యాలను రికవరీ చేసే ప్రయత్నం చేశారు. తాజాగా సీసీ పుటేజ్ లోని దృశ్యాలను రిట్రీవ్ చేయించారు.
ఈ నేపథ్యంలో పోలీసుల చేతికి కీలక ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. వీడియోలో నిందితులు దర్శన్ ఇంటికి వచ్చి..వెళ్లిన సంగతి బయటకు వచ్చింది. అంతేకాకండా రేణుకాస్వామి డెడ్ బాడీని తరలించే క్రమంలో లభించిన సాక్ష్యాధారాల్లో దర్శన్ వేలి ముద్రలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడకు వ్యతిరేకంగా కూడా బలమైన ఆధారాలు లభించినట్లు సమాచారం. పవిత్ర గౌడకు రేణుకాస్వామి పంపించిన అన్ని మెసేజ్ లను పోలీసులు ఆమె ఫోన్ నుంచి రిట్రీవ్ చేశారు. దీంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పరిణామంతో రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ చుట్టు ఉచ్చు మరింత ఉచ్చు బిగుస్తోంది.