Swetha
సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా తెలుగులో వరుసగా మంచి సినిమాలను తీసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రేక్షకులలో కూడా మంచి ఫాలోయింగ్ నే సంపాదించుకున్నాడు. కానీ ఛత్రపతి తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉన్న ఇమేజ్ ను పోగొట్టుకున్నట్టు అయింది.
సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా తెలుగులో వరుసగా మంచి సినిమాలను తీసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రేక్షకులలో కూడా మంచి ఫాలోయింగ్ నే సంపాదించుకున్నాడు. కానీ ఛత్రపతి తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉన్న ఇమేజ్ ను పోగొట్టుకున్నట్టు అయింది.
Swetha
సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా తెలుగులో వరుసగా మంచి సినిమాలను తీసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రేక్షకులలో కూడా మంచి ఫాలోయింగ్ నే సంపాదించుకున్నాడు. కానీ ఛత్రపతి తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉన్న ఇమేజ్ ను పోగొట్టుకున్నట్టు అయింది. ఆ తర్వాత రీసెంట్ గా భైరవం సినిమాతో మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో శ్రీనివాస్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి కానీ.. సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు కిష్కింధపురి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
నిజానికి ఈ సినిమా అనుకున్నదాని ప్రకారం సెప్టెంబర్ 12 న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజున తేజ సజ్జా మిరాయ్ రిలీజ్ కానుండడంతో దానికి పోటీగా వెళ్లడం ఎందుకని ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారట మేకర్స్. మరీ ఎక్కువ పోస్ట్ పోన్ కాకుండా ఒక్క రోజు ఆలస్యంతో రిలీజ్ చేయనున్నారు. అంటే సెప్టెంబర్ 13న కిష్కింధపురి రిలీజ్ అవుతుంది. నిజానికి 13 డేట్ అనేది హర్రర్ సినిమాలకు కలిసి వచ్చే డేట్. సో మిరాయ్ తో పోటీ ఎందుకు అనేది ఓ రీజన్ అయితే.. హర్రర్ మూవీ సెంటిమెంట్స్ ప్రకారం కూడా ఆలోచించి సెప్టెంబర్ 13ను లాక్ చేసుకున్నారు మేకర్స్.
ప్రస్తుతానికి సినిమా గురించైతే పాజిటివ్ బజ్ ఏ వినిపిస్తుంది. అందులోను ఈ మధ్య హర్రర్ సినిమాలకు డిమాండ్ బాగానే ఉంది కాబట్టి.. ఒక్కసారి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఇక మిగత ప్రమోషన్స్ సోషల్ మీడియా చూసుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.