iDreamPost
android-app
ios-app

డిజాస్టర్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ! ఇది సాహసమనే చెప్పాలి..

  • Published Jun 08, 2024 | 8:59 PM Updated Updated Jun 08, 2024 | 10:03 PM

బెల్లంకొండ శ్రీనివాస్ ఓ భారీ సాహసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్లాప్ మూవీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లుగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ ఓ భారీ సాహసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్లాప్ మూవీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లుగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 08, 2024 | 8:59 PMUpdated Jun 08, 2024 | 10:03 PM
డిజాస్టర్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ! ఇది సాహసమనే చెప్పాలి..

ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్, టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేకుంటే హిట్లు పడవు. ఇది నేను చెబుతున్న మాట కాదు. పరిశ్రమలో కొందరు హీరోల కెరీర్ చూస్తే మీరు కూడా ఇదే అంటారు. అయితే టాలెంట్, బ్యాగ్రౌండ్ ఉండి.. హీరోగా సరిపోయే కటౌట్ ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. అయితే హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా ఈ హీరో సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు ఓ భారీ సాహసం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్లాప్ మూవీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లుగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్.. స్టార్ ప్రొడ్యూసర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి, వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. కానీ సాలిడ్ హిట్లు మాత్రం రావడం లేదు. ‘రాక్షసుడు’ అనే మూవీ మాత్రం బెల్లంకొండ కెరీర్ లో చెప్పుకొదగ్గ విజయం సాధించిన సినిమా. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకులను ఇలా పలకరించి, అలా వెళ్లిపోయినవే. బాలీవుడ్ లో సైతం తన లక్ ను పరీక్షించుకుని భారీగా దెబ్బతిన్నాడు. చత్రపతి మూవీని అక్కడ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక ప్రస్తుతం భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా.. ఈ మూవీ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే చిత్రానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? తన నెక్ట్స్ మూవీ కోసం ఓ డిజాస్టర్ అందించిన దర్శకుడికి అవకాశం ఇచ్చాడని టాక్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కార్తికేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ‘చావు కబురు చల్లగా’ ను తెరకెక్కించిన కౌశిక్ పెగళ్లపాటి. ఇతడు చెప్పిన స్టోరీ లైన్ శ్రీనివాస్ కు బాగా నచ్చడంతో.. ఒకే కూడా చెప్పేశాడట. ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ మూవీ రాబోతుందని, డైరెక్టర్ పై నమ్మకంతో భారీ బడ్జెట్ ను సైతం పెట్టడానికి మేకర్స్ రెడీగా ఉన్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో డిజాస్టర్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి.. బెల్లంకొండ మరోసారి సహసం చేస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? అతడికి హిట్టించే డైరెక్టర్ కౌశికే కావొచ్చు అంటూ అండగా నిలుస్తున్నారు. మరి ప్లాప్ డైరెక్టర్ కు బెల్లంకొండ శ్రీనివాస్ ఛాన్స్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss