BSS 12: ప్రభాస్ రూట్ లో బెల్లంకొండ శ్రీనివాస్! ఈసారి హిట్ ఖాయమా?

తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం తన రూట్ మార్చి ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఆ వివరాల్లోకి వెళితే..

తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం తన రూట్ మార్చి ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో ఒకడు బెల్లంకొండ శ్రీనివాస్. టాలెంటెడ్ హీరో అయినప్పటికీ.. ఈ హీరోకి మాత్రం అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ తో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు. ప్రస్తుతం తన రూట్ మార్చి ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రస్తుతం ఈ హీరో వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘టైసన్ నాయుడు’, ‘కిష్కింధపురి’ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటుగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో తన12వ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దశావతారాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఓ 400 ఏళ్ల నాటి ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుందని టాక్. అసలు ఆ టెంపుల్ కు, దశావతారాలకు, హీరోకు సంబంధం ఏంటన్నదే కథ. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అదికాస్త ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ నడస్తోంది. రామాయణం, మహాభారతం రిఫరెన్స్ లకు సంబంధించిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ లిస్ట్ లో వచ్చిన హనుమాన్, కల్కి 2898 ఏడీ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు ఇదే బాటలో బెల్లంకొండ శ్రీనివాస్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో శ్రీనివాస్ తన రూట్ మార్చి సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. దాంతో ఈసారి హిట్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీకి ‘హైంధవ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి దశావతారాల కాన్సెప్ట్ ను మేకర్స్ ఎలా చూపిస్తారో.

Show comments