దేవర రిలీజ్ కి ముందు జాన్వీ కపూర్ కు బిగ్ షాక్!

Before Devara Janhvi Kapoor Got Disappointment From Ulajh Movie: జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూకి మంచి ప్రాజెక్ట్ ని సెలక్ట్ చేసుకుంది. తారక్ తో కలిసి దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోయింది. అయితే ఈ మూవీకి ముందు జాన్వీ కపూర్ కి బిగ్ షాక్ తగిలింది.

Before Devara Janhvi Kapoor Got Disappointment From Ulajh Movie: జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూకి మంచి ప్రాజెక్ట్ ని సెలక్ట్ చేసుకుంది. తారక్ తో కలిసి దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోయింది. అయితే ఈ మూవీకి ముందు జాన్వీ కపూర్ కి బిగ్ షాక్ తగిలింది.

దేవర సినిమాకి సంబంధించి ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మూవీ టీమ్ నుంచి వస్తున్న అప్ డేట్స్ కు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆగస్టు 5న ఒక మంచి డ్యూయట్ ని సెకండ్ సింగిల్ గా తీసుకురాబోతున్నారు. ఈ సాంగ్ లో తారక్- జాన్వీ కపూర్ ఎంతో లవ్ లీ కనిపిస్తున్నారు. జాన్వీ కపూర్ అయితే అతిలోక సుందరి తరహాలో కనిపిస్తోంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ జాన్వీ కపూర్ కు టాలీవుడ్ డెబ్యూ అని తెలిసిందే. ఈ మూవీతో జాన్వీ కపూర్ కు టాలీవుడ్ లో కూడా మార్కెట్, ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతుందని భారీగానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే దేవర రిలీజ్ కి ముందు ఈ భామకు బిగ్ షాక్ తగిలింది.

జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ కోసం ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. శ్రీదేవి కుమార్తెను తెలుగు సినిమాలో చూడాలి అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారి ఆశలు తీరేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. తారక్ తో కలిసి దేవర పార్ట్ 1తో జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడుకు చిన్న షాక్ తగిలింది. అదేంటంటే.. దేవర కంటే ముందు మంచి హిట్టుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని జాన్వీ కపూర్ భావించింది. తాజాగా ఆమె నటించిన ఉల్జా అనే హిందీ చిత్రం థియేటర్లలో విడుదలైంది. కానీ, ఆ మూవీకి ప్రేక్షకుల నుంచి ఆశించిన ఫలితం దక్కలేదు అంటున్నారు.

ఉల్జా చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీకి సంబంధించి బీ టౌన్ ప్రేక్షకుల నుంచి కాస్త నెగిటివ్ టాకే వినిపిస్తోంది. అటు రివ్యూస్ కూడా ఆశించిన మేర సినిమా ఆకట్టుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి జాన్వీ కపూర్ ఈ ఉల్జా మూవీ ప్రమోషన్స్ అన్నీ తన భుజాలపై వేసుకుంది. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చాలానే కష్టపడింది. కానీ, మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది అంటున్నారు. ఈ నేపథ్యంలో హిట్టు కొట్టి దేవరతో రావాలి అనుకున్న జాన్వీ కపూర్ కి నిరాశ తప్పలేదు. ఇంక దేవర పార్ట్ 1 రిలీజ్ కాకుండానే.. జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాబోలో రాబోతున్న ప్రాజెక్టులో జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జాన్వీ కాన్సన్ ట్రేషన్ మొత్తం దేవర పార్ట్ 1పై పెట్టింది అంటున్నారు.

Show comments