iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్.. హేమకు మరో పెద్ద కష్టం.. రేవ్ పార్టీ కేసు విచారణలో ఉండగానే

Bangalore Rave Party Case- Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితురాలిగా ఉన్న హేమకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూవీస్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమె మీద కఠిన చర్యలకు ఉపక్రమించారు. అసలే కేసులో ఇరుకున్న హేమకు ఇది మరో ఎదురుదెబ్బ అనాల్సిందే.

Bangalore Rave Party Case- Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితురాలిగా ఉన్న హేమకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూవీస్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆమె మీద కఠిన చర్యలకు ఉపక్రమించారు. అసలే కేసులో ఇరుకున్న హేమకు ఇది మరో ఎదురుదెబ్బ అనాల్సిందే.

బ్రేకింగ్.. హేమకు మరో పెద్ద కష్టం.. రేవ్ పార్టీ కేసు విచారణలో ఉండగానే

బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్టైన టాలీవుడ్ నటి హేమకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కేసు విచారణలో ఉండగానే ఆమెకు మరో పెద్ద కష్టం వచ్చి పడింది. ఆమె మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కోల్పోయింది. హేమకు మా సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. హేమను సస్పెండ్ చేసే విషయమై బుధవాం మా ప్యానెల్ సుదీర్ఘంగా చర్చించిందని విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు మా సభ్యులకు ప్రకటించారు. కాగా, ఈ మేరకు మా సెక్రటరీ రఘుబాబు కీలక ప్రకటన చేశారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు.

రేవ్ పార్టీ విషయంలో తొలుత మంచు విష్ణు స్పందిస్తూ.. ఆమెపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఆమె దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలని, ఆమెపై ఎటువంటి ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు. అలాగే రేవ్ పార్టీ కేసులో ఆమెను వివరణ కోరుతూ నోటీసులకు హేమ స్పందించకపోవడంతో ఇప్పుడు సస్పెండ్ వేటు పడింది. కాగా, ఎగ్జిక్యూటీవ్ కమిటీ నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు రఘుబాబు రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే క్రమంలో హేమ విచారణకు సహకరించాలని కోరారు. గత నెల 20న బర్త్ డే పార్టీ పేరుతో వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీని నిర్వహించిన సంగతి విదితమే.

అక్కడ నానా యాగీ చేయగా.. పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు.. అది పుట్టిన రోజు పార్టీ కాదని, రేవ్ పార్టీ అని అర్థమైంది. వారందరినీ అదుపులోకి తీసుకుని.. శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఈ పార్టీలో ఎక్కువగా తెలుగు వారే పాల్గొనడం గమనార్హం. పరీక్షల్లో తెలుగు వ్యక్తులందరూ విచారణకు హేమ సహకరించాలని కోరారు. స్థానిక పోలీసులు అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచిన సంగతి విదితమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. బర్త్ డే పార్టీ పేరుతో గత నెల 20న బెంగళూరులోని ఓ ఫాం హౌస్‌లో వేడుకలు జరగ్గా.. అక్కడ పెద్దఎత్తున తెలుగు వ్యక్తులు పాల్గొన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో హేమ మా సభ్యత్వం రద్దు చేశారు. ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు మా సెక్రటరీ రఘుబాబు ప్రకటన చేశారు.