టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరోలకు సంబంధించి సూపర్ హిట్ సినిమాలన్నీ మరోసారి తెరపై చూసుకుంటున్నారు. అభిమానుల డిమాండ్ మేరకు మేకర్స్ కూడా 4K టెక్నాలజీతో ఆయా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సింహాద్రి, పోకిరి, జల్సా, ఖుషి, చెన్నకేశవరెడ్డి, రఘువరన్ బీటెక్.. ఇలా చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇందులో ఖుషి, పోకిరి, బిజినెస్ మెన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరోసారి మంచి కలెక్షన్స్ వసూల్ చేశాయి. అయితే.. సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేసుకున్నా ఎంజాయ్ చేయొచ్చు. కానీ.. ప్లాప్ సినిమాలు వేస్తేనే అభిమానులు నిరాశ పడేది.
ఈ క్రమంలో.. రీ రిలీజ్ విషయమై నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం బాధపడుతున్నారు. ఎందుకంటే.. బాలయ్య కెరీర్ సూపర్ హిట్ అయిన సినిమాలు కాకుండా.. ప్లాప్, డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలను రీ రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ నిర్ణయం తీసుకోవడమే. ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా.. బాలయ్య నటించిన ప్లాప్ మూవీస్ ఒక్క మగాడు, లయన్ సినిమాలు రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి పోస్టర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయ్యాయి. ఈ సినిమాలు టీవీలో వస్తేనే పట్టించుకోని ఫ్యాన్స్, జనాలు.. ఇంకా థియేటర్స్ కి ఏం వస్తారని టాక్ నడుస్తోంది.
అసలు ఈ సినిమాలు ఎందుకని థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు అని నందమూరి ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. బాలయ్య కెరీర్ సూపర్ హిట్ అయిన సినిమాలు ఇంకా వేరే ఉన్నాయి. లెజెండ్, సింహా, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చుగా.. ఇలాంటి ప్లాప్ సినిమాలు ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిగాక ఈ మధ్య రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ చూస్తున్నారు అభిమానులు. అలాంటప్పుడు సూపర్ హిట్స్ రిలీజ్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాంటిది టీవీలలో కూడా చూడలేని సినిమాలను థియేటర్స్ లో రీరిలీజ్ చేయడం ఏంటంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఒక్క మగాడు, లయన్ సినిమాల రీ రిలీజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.