iDreamPost
android-app
ios-app

‘బలగం’ తర్వాత వేణు రెండో సినిమాలో హీరో అతడేనా..?

  • Author ajaykrishna Published - 08:34 AM, Mon - 31 July 23
  • Author ajaykrishna Published - 08:34 AM, Mon - 31 July 23
‘బలగం’ తర్వాత వేణు రెండో సినిమాలో హీరో అతడేనా..?

ఈ ఏడాది కమెడియన్ టిల్లు వేణు కాస్త ఇండస్ట్రీలో డైరెక్టర్ గా డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. తాను తీసిన బ్లాక్ బస్టర్ బలగం మూవీతో.. టిల్లు వేణు నుండి బలగం వేణుగా మారిపోయాడు. ఇన్నాళ్లు కమెడియన్ గా ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన వేణు.. బలగం మూవీతో ఒక్కసారిగా డైరెక్టర్ అవతారం ఎత్తి అందరిని సర్ప్రైజ్ చేశాడు. ఎన్నో ఏళ్లుగా బలగం మూవీని తీయాలని ప్లాన్ చేసిన వేణు.. చివరికి ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తీసి చూపించాడు. కట్ చేస్తే.. రిలీజ్ తర్వాత సినిమా ఎలాంటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ పల్లెటూరు కాకి కథ.. అందరిని కదిలించింది.

ఇక చాలా ఏళ్ల తర్వాత బలగం సినిమా.. తెలంగాణ ప్రాంతం భాష యాసలతో పాటు బంధాలను, ఎమోషన్స్ ని తట్టిలేపిందని ప్రశంసలు అందుకుంది. ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో అవార్డులు సైతం సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా వేణు డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా.. తన నుండి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం రాబోతుందా? అనే ఆసక్తి కూడా క్రియేట్ చేశాడు. బలగం సింపుల్ స్టోరీతో వచ్చినప్పటికి.. అందులో ఎన్నో హాట్ టచింగ్ పాయింట్స్ ఉన్నాయి. చక్కని పాటలు.. విజువల్స్ కుదిరాయి. అయితే.. వేణు తన రెండో సినిమాకి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు జరిగి.. స్క్రిప్ట్ వర్క్ మొదలైందని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. వేణు సెకండ్ మూవీ ఏ హీరోతో చేయబోతున్నాడు? అని అందరిని ఎక్సయిట్ చేస్తున్న విషయం. కాగా.. దీని గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో, సోషల్ మీడియాలో పలు ఇంటరెస్టింగ్ కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. వేణు రెండో మూవీలో కూడా బలగంలో నటించిన ప్రియదర్శినే హీరోగా నటిస్తాడట. ప్రెజెంట్ టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. కానీ.. వేణు నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈసారి కూడా బలగం లాంటి సింపుల్ సబ్జెక్టుతో అందరికి కనెక్ట్ అయ్యేలా సినిమా తీయాలని వేణు ఆలోచన చేస్తున్నాడట. అతి త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ బయటికి రాలేదు. సో.. బలగం వేణు రెండో సినిమా గురించి మీరు ఎంత ఎక్సయిటింగ్ గా ఉన్నారు? కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş