Venkateswarlu
తాజాగా, ఆయన బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘‘ భగవంత్ కేసరి’’ సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా
తాజాగా, ఆయన బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘‘ భగవంత్ కేసరి’’ సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా
Venkateswarlu
జబర్థస్త్ కమెడియన్ వేణు టిల్లు దర్శకత్వం వహించిన ‘‘ బలగం’’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటించిన ప్రతీ నటుడికి మంచి గుర్తింపు వచ్చింది. అలా బలగం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు ‘‘బలంగం బావ’’ మురళీధర్ గౌడ్. నటన మీద ఆసక్తితో ఆయన లేటు వయసులో ఇండస్ట్రీలోకి వచ్చారాయన. తన మార్క్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
సినిమాల్లోకి రాకముందు మురళీధర్ గౌడ్ ఎలక్ట్రిసిటీ బోర్డులో 27 ఏళ్ల పాటు పని చేశారు. ఉద్యోగంలోంచి రిటైర్డ్ అయిన తర్వాత నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చారు. వయసు ప్రభావం దృష్ట్యా సినిమాల్లో అవకాశాలు వస్తాయా? రావా? అన్న అనుమానంతో సీరియల్స్ వైపు వెళ్లారు. పలు సీరియళ్లలో నటించారు. అక్కడ మంచి గుర్తింపు వచ్చిన తర్వాత సినిమా వైపు వచ్చారు. సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. డీజే టిల్లుతో గుర్తింపు రాగా.. బలగం సినిమాతో ఆ గుర్తింపు మరింత పెరిగింది.
తాజాగా, ఆయన బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘‘ భగవంత్ కేసరి’’ సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీధర్ గౌడ్ ఎమోషనల్ అయ్యారు. తన జర్నీ గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. ‘‘ తనకు ఇంత మంచి గుర్తింపు వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. మరి, లేటు వయసులో సినిమాల్లో సత్తా చాటుతున్న మురళీధర్ గౌడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.