డార్లింగ్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసి.. ప్రపంచఖ్యాతిని తెచ్చిన క్యారెక్టర్ బాహుబలి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. ఫస్ట్ తెలుగు పాన్ ఇండియా మూవీగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. బాహుబలి క్యారెక్టర్ తో ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయిపోయాడు ప్రభాస్. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు.. అప్పట్లోనే బాహుబలి గెటప్ లో ప్రభాస్ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. దీంతో లండన్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం. ఆ విగ్రహం ఏర్పాటుతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.
కట్ చేస్తే.. ఇన్నేళ్లకు మళ్లీ ప్రభాస్ బాహుబలి మైనపు విగ్రహాన్ని బెంగళూరులోని ఓ మ్యూజియంలో కొత్తగా ఏర్పాటు చేశారు. కానీ.. గెటప్ బాహుబలిదే అయినప్పటికీ.. లుక్ లో తేడా కొట్టడంతో ప్రస్తుతం తీవ్రమైన విమర్శలు ఆ విగ్రహం గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఆ ఫోటోలు వైరల్ అవుతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆ విగ్రహం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్స్ చేస్తున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రభాస్ మైనపు విగ్రహంపై బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ.. సీరియస్ అయ్యారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. “ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకొని చేసిన వర్క్ కాదు. ఎలాంటి సమాచారం.. మా పర్మిషన్ లేకుండా ఈ బొమ్మని తయారు చేశారు. వెంటనే ఈ విగ్రహం తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం” అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ కాగా.. ఫ్యాన్స్ కి మరింత బలం వచ్చిందని చెప్పవచ్చు. నిజానికి బాహుబలి గెటప్ లో ఉన్నప్పటికీ.. ఆ విగ్రహం లుక్ మాత్రం ప్రభాస్ లాగా లేకపోవడం ఇక్కడ రచ్చకు దారి తీసిన విషయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నిర్మాత కూడా ఎలాంటి లైసెన్స్ లేకుండా చేశారని అన్నారు. కాబట్టి.. ఆ విగ్రహం మ్యూజియం వాళ్ళు ఉంచుతారో తీస్తారో చూడాలి. ఒకవేళ ఉంచితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ నుండి మరింత తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడే అవకాశం లేకపోలేదు. సో.. ప్రభాస్ మైనపు బొమ్మ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
This not an officially licensed work and was done without our permission or knowledge. We will be taking immediate steps to get this removed. https://t.co/1SDRXdgdpi
— Shobu Yarlagadda (@Shobu_) September 25, 2023