iDreamPost
android-app
ios-app

Bade Miyan Chote Miyan : ఫ్లాప్ ల వల్ల నా స్టైల్ మార్చుకోను: అక్షయ్ కుమార్

  • Published Mar 28, 2024 | 8:58 AM Updated Updated Mar 28, 2024 | 8:59 AM

బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నటుడు అక్షయ్ కుమార్.కొన్ని సార్లు నా ప్రయత్నంలో విజయం సాధించవచ్చు, కొన్ని సార్లు పరాజయం పాలవచ్చు.

బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నటుడు అక్షయ్ కుమార్.కొన్ని సార్లు నా ప్రయత్నంలో విజయం సాధించవచ్చు, కొన్ని సార్లు పరాజయం పాలవచ్చు.

  • Published Mar 28, 2024 | 8:58 AMUpdated Mar 28, 2024 | 8:59 AM
Bade Miyan Chote Miyan : ఫ్లాప్ ల వల్ల నా స్టైల్ మార్చుకోను: అక్షయ్ కుమార్

బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నటుడు అక్షయ్ కుమార్. సంవత్సరానికి ఖచ్చితంగా నాలుగు సినిమాల పైనే నటించే ఈ స్టార్ హీరో తాజాగా మరో యాక్షన్-ప్యాక్డ్ మూవీ బడే మియా చోటే మియా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కాగా యువ హీరో టైగర్ ష్రాఫ్ కూడా అక్షయ్ పక్కన ఈ సినిమాలో నటించారు. ఏప్రిల్ 10న రంజాన్ స్పెషల్ గా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అయితే ట్రైలర్ ఈవెంట్ లో అక్షయ్ కుమార్ అన్న మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ట్రైలర్ లాంచ్‌లో అక్షయ్ కుమార్ తన వరుస ఫ్లాపుల గురించి మాట్లాడారు. తను డిఫరెంట్ జానర్ సినిమాల్లో నటించడం గురించి కూడా మాట్లాడిన అక్షయ్, ఒక సందర్భంలో వరుసగా 16 ఫ్లాప్‌లు ఎదురుకున్నా తాను విభిన్న జానర్ చిత్రాలను ప్రయత్నించకుండా ఆగిపోలేదని చెప్పారు. అక్షయ్ కుమార్ ఇటీవల నటించిన రక్షా బంధన్, రామ్ సేతు, సామ్రాట్ పృథ్వీరాజ్, మిషన్ రాణిగంజ్ లతో పాటు ఓటీటీలో విడుదలైన కట్ పుట్లీ (రక్షసన్ రీమేక్) కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయారు. అయితే అక్షయ్ కీలక పాత్రలో నటించిన ఓ మై గాడ్ 2 సినిమా మాత్రం చక్కని ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. “టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ఎయిర్‌లిఫ్ట్, రుస్తుం లేదా నేను చేసిన అనేక ఇతర సినిమాలు ఫలితం ఆశించి చేయలేదు. కొన్ని సార్లు నా ప్రయత్నంలో విజయం సాధించవచ్చు, కొన్ని సార్లు పరాజయం పాలవచ్చు. ఇది నాకు కొత్తేమీ కాదు నేను ఇంతకు ముందు చూడనిదీ కాదు. ఒకప్పుడు నాకు వరుసగా 16 ఫ్లాప్‌లు వచ్చాయి. కానీ నేను నమ్మకంతో నిలబడి పని చేస్తూనే ఉన్నాను, ”అని అక్షయ్ చెప్పారు.

Akshay kumar

అందరూ వెళ్తున్న ట్రెండ్ ఆధారంగా సినిమాలు చేయడం తనకు బోరింగ్‌గా ఉంటుందని అక్షయ్ చెప్పారు. అలా చెబుతూనే, బడే మియా చోటే మియా సినిమా కోసం టీమ్ మొత్తం చాలా కష్టపడిందని, సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నానని అక్షయ్ అన్నారు. అయితే సోషల్ మీడియాలో చాలా మంది అక్షయ్ స్టార్‌డమ్ ఒకప్పటిలా లేదని, ఇప్పుడు ఆయన బిగ్ హిట్స్ కొట్టడం అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. కానీ అక్షయ్ కుమార్ అభిమానులు మాత్రం బడే మియా చోటే మియా సినిమా భారీ విజయం సాధిస్తుందని అంటున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş