iDreamPost
android-app
ios-app

లోకేశ్ కనగరాజ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

దక్షిణాది సినీ పరిశ్రమలో యంగ్ టాలెంట్స్ తమ సత్తాను చాటుతున్నారు. సినిమాను కొత్తగా ప్రజెంట్ చేస్తూ.. ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్నారు. ఆ దర్శకుల్లో ఒకరు లోకేశ్ కనగరాజ్. చేసినవీ కొన్ని సినిమాలే అయినప్పటికీ..

దక్షిణాది సినీ పరిశ్రమలో యంగ్ టాలెంట్స్ తమ సత్తాను చాటుతున్నారు. సినిమాను కొత్తగా ప్రజెంట్ చేస్తూ.. ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్నారు. ఆ దర్శకుల్లో ఒకరు లోకేశ్ కనగరాజ్. చేసినవీ కొన్ని సినిమాలే అయినప్పటికీ..

లోకేశ్ కనగరాజ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..

లోకేశ్ కనగ రాజ్ డైరెక్టర్లలో ఇప్పుడొక ట్రెండ్ సెట్టార్. బడా హీరోలను డైరెక్ట్ చేస్తూ.. వారికి మాస్ హిట్స్ ఇస్తూ టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీ అయ్యాడు. దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించిన సమయంలోనే.. ఫ్యూచర్ మూవీస్, కథలు సిద్ధం చేసుకున్న ఈ సునామీ డైరెక్టర్.. వాటిని స్క్రీన్ పై అప్లై చేస్తూ.. అభిమానులకు షాక్‌కు గురి చేస్తున్నాడు. ఒక సినిమాను మరో మూవీతో లింక్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనే కొత్త పోకడను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. 2016లో అవియల్ అనే మూవీతో దర్శకుడిగా పరిచమయ్యాడు ఈ యంగ్ టాలెంట్. కానీ అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం ఖైదీతోనే.. విక్రమ్, ఇటీవల వచ్చిన లియో ఇండస్ట్రీకి మరో హిట్ అందించాడీ దర్శకుడు. ఈ మూడు సినిమాలు ఎల్‌సియులో భాగమే.

అయితే తాను 10 సినిమాలు మాత్రమే చేస్తానని లోకేశ్ గతంలో ప్రకటించిన సంగతి విదితమే. లియో సక్సెస్ తర్వాత ఆయన తదుపరి సినిమాపై దృష్టి సారించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి మూవీ కోసం ఈ‌గర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందులో ఉండే సినిమాటిక్ యూనివర్స్ ఏంటోనని ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ సర్య్కులేట్ అవుతుంది. అదే ఆయన ఇక LCU సినిమాలు చేయడని. ఆ బాధ్యతను తన అసిస్టెంట్లకు అప్పగించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే తన మల్టీవర్ స్టోరీస్‌ను అసిసెంట్ డైరెక్టర్ల భుజాన వేస్తున్నాడట లోకేశ్. ఖైదీ 2, విక్రమ్ 2 మూవీస్‌ను తెరకెక్కించే బాధ్యతలను ఆయన దగ్గర పనిచేస్తున్న సహాయ దర్శకులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అతడు డిఫరెంట్ స్టోరీస్ పై దృష్టి పెడుతున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఖైదీ, విక్రమ్, లియో మూవీస్ తో మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న ఈ డైరెక్టర్.. నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అభిమానులు హర్ట్ అవ్వడం ఖాయం. చేస్తానంటున్నవే తక్కువ సినిమాలు, అందులో కూడా మ్యాజిక్ చేస్తూ.. మెస్మరైజ్ చేస్తున్న లోకేశ్.. LCUలో భాగంగా సినిమాలు తీయకపోతే.. రోలెక్స్ లాంటి పాత్రలు మళ్లీ తెరపై చూడటం సాధ్యపడదు. బడా హీరోలతో మూవీలు తీస్తూ.. ఇంటర్ లింక్ కనెక్షన్ పెడుతూ.. వారందిరినీ మళ్లీ తన చిత్రంతోనే ఒకేసారి తెరపైకి తెస్తాడనుకుంటున్న సమయంలో LCUలో సినిమాలు తీయడన్న వార్త ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap