iDreamPost
android-app
ios-app

కొనసాగుతున్న బేబీ రికార్డుల వేట.. ఏకంగా KGF2 రికార్డు బ్రేక్!

కొనసాగుతున్న బేబీ రికార్డుల వేట.. ఏకంగా KGF2 రికార్డు బ్రేక్!

ఒక చిన్న సినిమా ఇప్పుడు పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోంది. అది కూడా చిన్నా చితక సినిమాలు కాకుండా.. ఏకంగా పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద బేబీ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. రెండు వారాలు గడుస్తున్నా కలెక్షన్స్ జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పుడు బేబీ బ్రేక్ చేసిన రికార్డు గురించి టాలీవుడ్ మొత్తం మాట్లాడుకుంటోంది.

సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో ఎస్కేన్ ఈ సినిమాని తెరకెక్కించారు. టాలీవుడ్ లో ఒక కల్ట్ సినిమాగా పేరు సంపాదించిందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చిన బేబీ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పడు ఈ మూవీ రూ.70 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 13 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇంక రికార్డుల విషయానికి వస్తే.. బ్రేక్ చేసుకుంటూ పోతూనే ఉంది. ఇప్పటికే రౌడీ హీరో ఆల్ టైమ్ కలెక్షన్స్ సాధించిన అర్జున్ రెడ్డి రికార్డు బ్రేక్ చేసింది.

ఇప్పుడు ఏకంగా ప్రశాంత్ నీల్- యశ్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసింది. కేజీఎఫ్- 2 సినిమా వరుసగా 12 రోజులు రోజుకు రూ.కోటి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ రికార్డును బేబీ మూవీ బ్రేక్ చేస్తూ.. వరుసగా 13 రోజులు రూ.కోటికిపైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రొడ్యూసర్ కి మాత్రమే కాకుండా.. డైరెక్టర్, హీరోయిన్, హీరోలకు కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా వైష్ణవి చైతన్యకు టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. డాన్స్, యాక్టింగ్, తెలంగాణ స్లాంగ్ తో వైష్ణవి తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆమె కోసం క్యూ కడుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి ఒక చిన్న సినిమా సక్సెస్ ఇప్పుడు చాలా పెద్దగా రీసౌండింగ్ వస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ