iDreamPost
android-app
ios-app

బేబీ డైరెక్టర్ కి రెండో కారు గిఫ్ట్! నిర్మాత ఉద్దేశం అది కాదా..?

  • Author ajaykrishna Published - 12:34 PM, Sat - 30 September 23
  • Author ajaykrishna Published - 12:34 PM, Sat - 30 September 23
బేబీ డైరెక్టర్ కి రెండో కారు గిఫ్ట్! నిర్మాత ఉద్దేశం అది కాదా..?

ఇండస్ట్రీలో సినిమాలు సూపర్ హిట్ అయితే దర్శకులకు నిర్మాతలు గిఫ్ట్స్ ఇవ్వడం మామూలు అయిపోయింది. ఈ గిఫ్టులు ఇచ్చే ఆనవాయితీ ఈ మధ్యకాలంలోనే బాగా ట్రెండ్ అవుతోంది. ఇదివరకు సినిమాలు హిట్ అయితే ఓ సక్సెస్ మీట్ జరిపేవారు. అంటే.. అప్పుడు సక్సెస్ మీట్ తర్వాత మూవీ కోసం పనిచేసిన వారికి ఏమైనా ఇచ్చేవారో లేదో తెలియదు. కానీ.. ఇప్పుడైతే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి.. మంచి కలెక్షన్స్ రాబడితే చాలు. దర్శకులకు నిర్మాతలు ఖరీదైన కారు తాళాలు చేతిలో పెట్టేస్తున్నారు. కొందరు బహుమానాలతో పాటు రెమ్యూనరేషన్ కింద అదనపు చెక్కులు కూడా ఇస్తుండటం విశేషం. టాలీవుడ్ లో ఈ గిఫ్ట్స్ ఇవ్వడం తక్కువగా చూస్తుంటాం.

మొన్నటిదాకా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా సక్సెస్ తో నిర్మాత మూవీ టీమ్ కి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకి నిర్మాత కళానిధి మారన్.. రూ. వంద కోట్ల చెక్ తో పాటు బిఎండబ్ల్యూ కారు ఇచ్చారు. అలాగే జైలర్ డైరెక్టర్ నెల్సన్ కి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లకు సైతం నిర్మాత చెక్స్, కార్స్ గిఫ్ట్ కింద ఇచ్చారు. అయితే.. అలా గిఫ్టులు ఇచ్చారో లేదో.. కొద్దిరోజుల తర్వాత జైలర్ కి సీక్వెల్ ఉందంటూ చెప్పారు. అంతటితో ఆగకుండా.. జైలర్ సీక్వెల్ కోసం అడ్వాన్స్ గా దర్శకుడికి రూ. 55 కోట్ల వరకు చెక్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కి రెండో గిఫ్ట్ ఇచ్చాడు నిర్మాత SKN.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయిరాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బేబీ. రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రూ. 10 కోట్ల వరకు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 85 కోట్లకు పైగా వసూల్ చేసింది. దీంతో సినిమాపై ముందునుండి నమ్మకం ఉన్న నిర్మాత బేబీ రిలీజ్ కి ముందు ఓ కారు.. రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయ్యాక కొత్తగా బెంజ్ కారును డైరెక్టర్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే.. రెండో కారు గిఫ్ట్ గా ఇచ్చిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. సెకండ్ కారు గిఫ్ట్ గా ఇచ్చి.. అదే డైరెక్టర్ తో మరో సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడట ప్రొడ్యూసర్. సో.. సెకండ్ కారు వెనుక ఉద్దేశం ఇదేనా.. SKN కూడా జైలర్ ప్రొడ్యూసర్ ని ఫాలో అయ్యాడని అంటున్నారు నెటిజన్స్. మరి బేబీ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss